అధైర్య పడకండి అండగా ఉంటా - కౌన్సిలర్ పాపిశెట్టి రాము
ఆమనగల్లు రంగారెడ్డి:
ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అధైర్య పడకుండా అండగా ఉంటానని ప్రముఖ సంఘ సేవకుడు, ఆమనగల్లు మునిసిపాలిటీ ఐదవ వార్డుకౌన్సిలర్ పాపిశెట్టి రాము చెప్పారు. మండల పరిధిలోని శెట్టిపల్లి గ్రామానికిచెందిన రమణమ్మ సోమవారంరాత్రి మృతి చెందినది. విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు, ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు, కౌన్సిలర్ పాపిశెట్టి రాము ఆమె పార్థివ దేహానికి పూలమాలలు వేసి ఘనంగానివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు తన వంతు సహాయంగా ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబానికి ఎలాంటి ఆపద వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో రామన్న మిత్రమండలి సభ్యులు శ్రీను నాయక్, రమేష్ , భుజంగం, గ్రామస్తులు వెంకటయ్య, జంగయ్య, మల్లేష్ , కుమార్, రాములు, సాయిలయ్య, చిన్న, యాదయ్య తదితరులు, మృతురాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.