BREAKING
అలరించడానికి వస్తున్న కీర్తి సురేశ్ 'సత్యవాన్ సావిత్రి'.. ఆకట్టుకుంటున్న 'చక్కని కళ్ళ పిల్లా' సెకండ్ సింగిల్! పలమనేరు మున్సిపాలిటీపై టీడీపీ జెండా 3475 ఓట్ల ఆధిక్యంతో చైర్‌పర్సన్‌గా రాజ్యలక్ష్మి విజయం ఆత్మకూరులో ఫలించిన ఆనం వ్యూహం - మలుపు తిరిగిన రాజకీయం - బొమ్మిరెడ్డి రంగ ప్రవేశం - మున్సిపాలిటీ కైవసం నెల్లూరు రూరల్ 2వ డివిజన్‌లో టీడీపీ జయకేతనం! సబ్బవరం పరిషత్ ఎన్నికల్లో సీట్ల వివాదం... టీడీపీ తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పంచకర్ల విజయవాడ, గుంటూరులకు దీటుగా తెనాలి అభివృద్ధి చేస్తాం.... నూతన మున్సిపల్ చైర్మన్ తోటకూర మర్రిపాడులో మంత్రి ఆనం విస్తృత ఎన్నికల ప్రచారం పౌండ్‌ల్యాండ్ భవితవ్యంపై బ్రిటన్ ప్రభుత్వం ఆందోళన విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా జిల్లా స్థాయి పోటీలు బుచ్చి మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో టిడిపి హవా ఫెరారీ లూస్ ఈవీకి భారీ డిమాండ్.. 2027 నాటికి అన్ని కార్లు బుక్ పూర్తి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పురస్కారం ప్రదానం; ‘శ్వాశ్వ’ గ్రంథావిష్కరణ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌కు పాకిస్థాన్ షాహీన్స్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా అబ్దుల్ సమద్! మురసు తుఫానుతో ఉద్యాన పంటల పరిశీలన.  హెచ్ ఓ అంజలి భాయ్ కృత్రిమ మేధస్సు రేసులో దిగ్గజ సంస్థలకు భారం.. ఆపిల్‌పై పడుతున్న వ్యయాల సెగ

మూడు మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలి.

Select Suryaa Now
మూడు మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలి.

సిద్దిపేట మేజర్ న్యూస్ ప్రతినిధి ; ఎల్ నినో ప్రభావంతో సిద్దిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, కరువు పరిస్థితుల కారణంగా ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.ఈ మూడు మండలాలను కూడా కరువు మండలాలుగా గుర్తించాలని కోరుతూ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి గారికి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు.ఎల్ నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవకపోవడంతో ఆయా మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు రానున్న రోజుల్లో తాగునీటి సమస్యలు సైతం ఎదురయ్యే అవకాశం ఉందని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు.హుస్నాబాద్ నియోజకవర్గంలోని మొత్తం ఏడు మండలాల్లో ఇప్పటికే రెండు మండలాలను మాత్రమే కరువు మండలాలుగా గుర్తించారని, మిగిలిన ఐదు మండలాల్లోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సిద్దిపేట జిల్లా పరిధిలోని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని ముఖ్యమంత్రిని కోరారు.తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తమ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరుతూ ఆయా మండలాలు, గ్రామాల్లో ప్రజలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారని మంత్రి తెలిపారు.ప్రజలు, రైతుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను కరువు మండలాలుగా గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.