BREAKING
అలరించడానికి వస్తున్న కీర్తి సురేశ్ 'సత్యవాన్ సావిత్రి'.. ఆకట్టుకుంటున్న 'చక్కని కళ్ళ పిల్లా' సెకండ్ సింగిల్! పలమనేరు మున్సిపాలిటీపై టీడీపీ జెండా 3475 ఓట్ల ఆధిక్యంతో చైర్‌పర్సన్‌గా రాజ్యలక్ష్మి విజయం ఆత్మకూరులో ఫలించిన ఆనం వ్యూహం - మలుపు తిరిగిన రాజకీయం - బొమ్మిరెడ్డి రంగ ప్రవేశం - మున్సిపాలిటీ కైవసం నెల్లూరు రూరల్ 2వ డివిజన్‌లో టీడీపీ జయకేతనం! సబ్బవరం పరిషత్ ఎన్నికల్లో సీట్ల వివాదం... టీడీపీ తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పంచకర్ల విజయవాడ, గుంటూరులకు దీటుగా తెనాలి అభివృద్ధి చేస్తాం.... నూతన మున్సిపల్ చైర్మన్ తోటకూర మర్రిపాడులో మంత్రి ఆనం విస్తృత ఎన్నికల ప్రచారం పౌండ్‌ల్యాండ్ భవితవ్యంపై బ్రిటన్ ప్రభుత్వం ఆందోళన విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా జిల్లా స్థాయి పోటీలు బుచ్చి మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో టిడిపి హవా ఫెరారీ లూస్ ఈవీకి భారీ డిమాండ్.. 2027 నాటికి అన్ని కార్లు బుక్ పూర్తి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పురస్కారం ప్రదానం; ‘శ్వాశ్వ’ గ్రంథావిష్కరణ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌కు పాకిస్థాన్ షాహీన్స్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా అబ్దుల్ సమద్! మురసు తుఫానుతో ఉద్యాన పంటల పరిశీలన.  హెచ్ ఓ అంజలి భాయ్ కృత్రిమ మేధస్సు రేసులో దిగ్గజ సంస్థలకు భారం.. ఆపిల్‌పై పడుతున్న వ్యయాల సెగ

వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్ ఆవిష్కరణ

Select Suryaa Now
వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్ ఆవిష్కరణ
సూర్య కరీంనగర్ ;యువతలో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ అవగాహన పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–2027 జిల్లా స్థాయి పోటీల పోస్టర్‌ను అదనపు కలెక్టర్ డా. అశ్విని తానాజీ వాకడే ఆవిష్కరించారు.ఈ పోటీలు నవంబర్ 10న కరీంనగర్‌లోని ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా యువజన అధికారి జి. తిరుపతి రెడ్డి తెలిపారు. 18 నుంచి 25 సంవత్సరాల యువతీ యువకులు పాల్గొనవచ్చని, ఈ ఏడాది “వన్ నేషన్–వన్ ఎలక్షన్” అంశంపై కనీసం మూడు నిమిషాలు ప్రసంగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు మై భారత్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఎంపికైన వారికి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారులు బి. ఎలిజబెత్ రాణి, జి. రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.