ఎన్నికల ప్రచారంలో టిడిపి జడ్పీటీసీ అభ్యర్థి నీలం ప్రవీణ.
ముత్తుకూరు, మేజర్ న్యూస్ : తమ్ముడు... అక్క.. అవ్వా అంటూ ఓటర్లను పలకరిస్తూ పింఛన్లు వస్తున్నాయా... సంక్షేమ పథకాలు అందుతున్నాయా అంటూ ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని చివరి రోజు మంగళవారం తెలుగుదేశం పార్టీ జడ్పిటిసి అభ్యర్థి నీలం ప్రవీణ నిర్వహించారు. ముసునూరు పాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తపాలెం తోపాటు వివిధ గ్రామాల్లో ప్రచారం సాగింది. స్థానిక అధికార పార్టీ నాయకులు మునుకూరు రవికుమార్ రెడ్డి, సాగునీటి సంఘం అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్, పైనం పురం టిడిపి నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటింటి ప్రచారాన్ని జడ్పిటిసి అభ్యర్థి నీలం నిర్వహించారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ఆదరించి అభిమానించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఓటర్లు సానుకూలంగా స్పందించారు. జడ్పిటిసిగా గెలిపిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో టిడిపి దళిత నాయకులు పెడకాల కాంతారావు, వెంకటాచలం మండలం సమితి మాజీ ప్రెసిడెంట్ రత్నయ్య, దాసరి రమేష్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు