BREAKING
జీఎం దిగుమతులకు ఎలాంటి అనుమతి లేదు: పీయూష్ గోయల్ *మట్టి ప్రమిదల వెలుగుల్లోనే అసలైన దీపావళి!* అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్ ప్రభావం.. దేశంలో పెరిగిన క్రూడాయిడ్ ఫ్యూచర్స్ యువకులను నిండా ముంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌లో ఆ టాలెంట్‌ను ఇంకా సరిగ్గా వాడుకోలేదు.. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఆధ్యాత్మిక ప్రవచనాలపై విమర్శలు బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం గిరిజనుల హక్కులు, అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి గ్రామస్థాయి నుంచి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేద్దాం దివ్యాంగుల క్రీడల్లో మానకొండూర్ విద్యార్థుల ప్రతిభ తుఫాన్ బాధిత ప్రతి రైతుకూ పరిహారం.. ప్రభుత్వం అండగా ఉంటుంది వరి పంట నష్టపరిహారం హెక్టారుకు రూ.25 వేలకు పెంపు మంత్రి నిమ్మల రామానాయుడు చించినాడలో తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటన.. అధికారుల అలసత్వాన్ని సహించేది లేదని హెచ్చరిక కాంగ్రెస్ వైఫల్యాలపై గ్రామగ్రామాన పాదయాత్ర చేపడతాం గ్యాంబ్లింగ్ నేపథ్యంలో నిహారిక కొణిదెల 'పాకెట్ రాకెట్స్' టీజర్ విడుదల.. యూత్‌ను ఆకట్టుకుంటున్న వైవిధ్యభరితమైన కంటెంట్! అవినీతికి కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్ నువ్వూరుపాడులో ముమ్మరంగా టిడిపి నేతల ఎన్నికల ప్రచారం అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యమైన కందిపప్పు సరఫరా చేయాలి

శ్రీనివాస్ నగర్ అండర్‌పాస్ సైడ్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం: జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ భరద్వాజ్

Select Suryaa Now
శ్రీనివాస్ నగర్ అండర్‌పాస్ సైడ్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం: జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ భరద్వాజ్

సూర్య - మానకొండూర్: మానకొండూరు మండలం శ్రీనివాస్ నగర్ గ్రామ పరిధిలోని జాతీయ రహదారి అండర్‌పాస్ వద్ద ఎదురవుతున్న సైడ్ డ్రైనేజీ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ భరద్వాజ్ హామీ ఇచ్చారు.గ్రామ రైతులు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యల గురించి గ్రామ సర్పంచ్ ఎరుకల శ్రీనివాస్ గౌడ్, ఉపసర్పంచ్ మేకల మహేందర్ ఆధ్వర్యంలో రైతులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాప్రతినిధులు, రైతుల విన్నపానికి సానుకూలంగా స్పందించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ భరద్వాజ్ మంగళవారం నాడు గ్రామానికి చేరుకుని, అండర్‌పాస్ పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా డ్రైనేజీ లేకపోవడం వల్ల వర్షపు నీరు నిలిచిపోయి పంట పొలాలకు, రాకపోకలకు జరుగుతున్న ఇబ్బందులను సర్పంచ్, రైతులు ఆయనకు వివరించారు. సమస్య తీవ్రతను స్వయంగా పరిశీలించిన అధికారి స్పందిస్తూ.. రైతుల ఇబ్బందులను తొలగించేందుకు త్వరితగతిన సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులను చేపడతామని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని స్పష్టమైన హామీ ఇచ్చారు...