BREAKING
కాళ్లలో మునుపటి బలం లేదు.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ పండు! పలాస పుర పీఠం టీడీపీ కైవసం! దక్షిణ ఆఫ్రికాలో హింసాకాండ కలకలం చరిత్ర సృష్టించిన హైదరాబాదీ రేసర్.. ఎఫ్ఐఏ ఆసియా-పసిఫిక్ రాలీ ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకున్న జీత్ ఝబాఖ్! ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి! రంజీ ట్రోఫీలో చారిత్రక ఘనత.. 123 ఏళ్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన మిజోరాం బ్యాటర్ చిన్మయ్ సుతార్! వైభవంగా పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం అలరించడానికి వస్తున్న కీర్తి సురేశ్ 'సత్యవాన్ సావిత్రి'.. ఆకట్టుకుంటున్న 'చక్కని కళ్ళ పిల్లా' సెకండ్ సింగిల్! పలమనేరు మున్సిపాలిటీపై టీడీపీ జెండా 3475 ఓట్ల ఆధిక్యంతో చైర్‌పర్సన్‌గా రాజ్యలక్ష్మి విజయం ఆత్మకూరులో ఫలించిన ఆనం వ్యూహం - మలుపు తిరిగిన రాజకీయం - బొమ్మిరెడ్డి రంగ ప్రవేశం - మున్సిపాలిటీ కైవసం నెల్లూరు రూరల్ 2వ డివిజన్‌లో టీడీపీ జయకేతనం! సబ్బవరం పరిషత్ ఎన్నికల్లో సీట్ల వివాదం... టీడీపీ తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పంచకర్ల విజయవాడ, గుంటూరులకు దీటుగా తెనాలి అభివృద్ధి చేస్తాం.... నూతన మున్సిపల్ చైర్మన్ తోటకూర మర్రిపాడులో మంత్రి ఆనం విస్తృత ఎన్నికల ప్రచారం పౌండ్‌ల్యాండ్ భవితవ్యంపై బ్రిటన్ ప్రభుత్వం ఆందోళన

ఆధ్యాత్మిక ప్రవచనాలపై విమర్శలు బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం

Select Suryaa Now
ఆధ్యాత్మిక ప్రవచనాలపై విమర్శలు బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం

 

 
సూర్య, ముత్తారం ;; యువతలో నైతిక విలువలు, ప్రజల్లో మానవతా దృక్పథం పెంపొందించేందుకు మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్యాత్మిక ప్రవచనాలు ఏర్పాటు చేస్తే, వాటిని సైతం రాజకీయ విమర్శలకు వాడుకోవడం బీ ఆర్ ఎస్ నాయకుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ముత్తారం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బక్కతట్ల వినీత్ యాదవ్ మండిపడ్డారు. మంగళవారం ముత్తారంలో ఆయన మాట్లాడుతూ బీ ఆర్ ఎస్ పాలనలో గుంతల రోడ్లే మిగిలాయని, ఇసుక రీచ్‌ల పేరుతో భారీ వాహనాలను తిప్పి రహదారులను ధ్వంసం చేశారని విమర్శించారు. లారీల రాకపోకలతో మోకాళ్ల లోతు గుంతలు ఏర్పడి ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆ రోడ్లకు మరమ్మతులు చేయించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత మంత్రి శ్రీధర్ బాబుదేనని పేర్కొన్నారు. ఓడేడు వద్ద నిర్మాణంలో కూలిపోయిన బ్రిడ్జి విషయంలోనూ బీ ఆర్ ఎస్ నేతలు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వంతెన ఏడాది కూడా నిలవకముందే గడ్డర్లు కూలిపోవడం వారి పాలనలోని అవినీతికి నిదర్శనమని ఆరోపించారు. మంథని ప్రాంతంలో ధర్మం, మానవత గురించి మాట్లాడితే బీ ఆర్ ఎస్ నాయకులకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. ఇసుక మాఫియా కార్యకలాపాలు, కమీషన్ల వసూళ్లకు మంత్రి అడ్డుకట్ట వేస్తుండటంతోనే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఆధ్యాత్మిక ప్రవచనాలపై మాట్లాడే ముందు గతంలో ధ్వంసమైన రోడ్లు, కూలిన బ్రిడ్జిలను గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. బీఆరఎస్ పాలనలో అభివృద్ధి ఎక్కడ జరిగిందో ప్రజలకు వివరించాలని, రాజకీయ విమర్శలు మానుకోకపోతే ప్రజలు మరోసారి తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేశవపల్లి గ్రామ సర్పంచ్ పెగడ తిరుమల కుమార్, ఉప సర్పంచ్ సింగనవీణ సదయ్య, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, బుర్ర రవి తదితరులు పాల్గొన్నారు.