BREAKING
కాళ్లలో మునుపటి బలం లేదు.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ పండు! పలాస పుర పీఠం టీడీపీ కైవసం! దక్షిణ ఆఫ్రికాలో హింసాకాండ కలకలం చరిత్ర సృష్టించిన హైదరాబాదీ రేసర్.. ఎఫ్ఐఏ ఆసియా-పసిఫిక్ రాలీ ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకున్న జీత్ ఝబాఖ్! ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి! రంజీ ట్రోఫీలో చారిత్రక ఘనత.. 123 ఏళ్ల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన మిజోరాం బ్యాటర్ చిన్మయ్ సుతార్! వైభవంగా పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం అలరించడానికి వస్తున్న కీర్తి సురేశ్ 'సత్యవాన్ సావిత్రి'.. ఆకట్టుకుంటున్న 'చక్కని కళ్ళ పిల్లా' సెకండ్ సింగిల్! పలమనేరు మున్సిపాలిటీపై టీడీపీ జెండా 3475 ఓట్ల ఆధిక్యంతో చైర్‌పర్సన్‌గా రాజ్యలక్ష్మి విజయం ఆత్మకూరులో ఫలించిన ఆనం వ్యూహం - మలుపు తిరిగిన రాజకీయం - బొమ్మిరెడ్డి రంగ ప్రవేశం - మున్సిపాలిటీ కైవసం నెల్లూరు రూరల్ 2వ డివిజన్‌లో టీడీపీ జయకేతనం! సబ్బవరం పరిషత్ ఎన్నికల్లో సీట్ల వివాదం... టీడీపీ తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పంచకర్ల విజయవాడ, గుంటూరులకు దీటుగా తెనాలి అభివృద్ధి చేస్తాం.... నూతన మున్సిపల్ చైర్మన్ తోటకూర మర్రిపాడులో మంత్రి ఆనం విస్తృత ఎన్నికల ప్రచారం పౌండ్‌ల్యాండ్ భవితవ్యంపై బ్రిటన్ ప్రభుత్వం ఆందోళన

యువకులను నిండా ముంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

Select Suryaa Now
యువకులను నిండా ముంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం

సూర్య కరీంనగర్ ;నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం యువతను మోసం చేసిందని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ విమర్శించారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వంపై నమ్మకంతో యువత పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని తెలిపారు.యువ నాయకుడు రాగడి సందీప్ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో శనగొండ పవన్ కృష్ణ, దావరి కార్తీక్, జెరిపోతుల నవీన్, మహమ్మద్ అఫ్రోజ్ తెలంగాణ రక్షణ సేనలో చేరారు. వారికి గుంజపడుగు హరిప్రసాద్ కండువాలు కప్పి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులు, రైతులు, పేదలు, మధ్యతరగతి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. యువత రాజకీయాల్లోకి వచ్చి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జి అంకం శివరాణి, నగర అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మడిపల్లి వినీత్, జిల్లా నాయకులు గర్షకుర్తి విద్యాసాగర్, గుంజపడుగు పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.