BREAKING
అలరించడానికి వస్తున్న కీర్తి సురేశ్ 'సత్యవాన్ సావిత్రి'.. ఆకట్టుకుంటున్న 'చక్కని కళ్ళ పిల్లా' సెకండ్ సింగిల్! పలమనేరు మున్సిపాలిటీపై టీడీపీ జెండా 3475 ఓట్ల ఆధిక్యంతో చైర్‌పర్సన్‌గా రాజ్యలక్ష్మి విజయం ఆత్మకూరులో ఫలించిన ఆనం వ్యూహం - మలుపు తిరిగిన రాజకీయం - బొమ్మిరెడ్డి రంగ ప్రవేశం - మున్సిపాలిటీ కైవసం నెల్లూరు రూరల్ 2వ డివిజన్‌లో టీడీపీ జయకేతనం! సబ్బవరం పరిషత్ ఎన్నికల్లో సీట్ల వివాదం... టీడీపీ తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పంచకర్ల విజయవాడ, గుంటూరులకు దీటుగా తెనాలి అభివృద్ధి చేస్తాం.... నూతన మున్సిపల్ చైర్మన్ తోటకూర మర్రిపాడులో మంత్రి ఆనం విస్తృత ఎన్నికల ప్రచారం పౌండ్‌ల్యాండ్ భవితవ్యంపై బ్రిటన్ ప్రభుత్వం ఆందోళన విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా జిల్లా స్థాయి పోటీలు బుచ్చి మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో టిడిపి హవా ఫెరారీ లూస్ ఈవీకి భారీ డిమాండ్.. 2027 నాటికి అన్ని కార్లు బుక్ పూర్తి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పురస్కారం ప్రదానం; ‘శ్వాశ్వ’ గ్రంథావిష్కరణ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌కు పాకిస్థాన్ షాహీన్స్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా అబ్దుల్ సమద్! మురసు తుఫానుతో ఉద్యాన పంటల పరిశీలన.  హెచ్ ఓ అంజలి భాయ్ కృత్రిమ మేధస్సు రేసులో దిగ్గజ సంస్థలకు భారం.. ఆపిల్‌పై పడుతున్న వ్యయాల సెగ

కాంగ్రెస్ వైఫల్యాలపై గ్రామగ్రామాన పాదయాత్ర చేపడతాం

Select Suryaa Now
కాంగ్రెస్ వైఫల్యాలపై గ్రామగ్రామాన పాదయాత్ర చేపడతాం

సదాశివపేట;కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు త్వరలోనే గ్రామగ్రామాన పాదయాత్ర చేపడతామని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రకటించారు. సదాశివపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎదుర్కొంటున్న సమస్యలు, అక్రమ అరెస్టులు, వేధింపులు, అవమానాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వారి సమస్యలను సావధానంగా విన్న చింతా ప్రభాకర్ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు అంతర్గత విభేదాలతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారని, రైతులకు సాగునీరు అందించలేని పరిస్థితి నెలకొందని మండిపడ్డారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వస్తే 48 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి, ప్రస్తుతం రైతులకు అవసరమైన విద్యుత్, సాగునీరు అందించలేకపోతున్నారని విమర్శించారు.

బీఆర్ఎస్ కార్యకర్తలకు భరోసా ఇస్తూ.. పార్టీ కార్యకర్తకు ఏ చిన్న ఆపద వచ్చినా, సమస్య ఎదురైనా ఒక్క మిస్ కాల్ చేయాలని, వెంటనే వారి ముందుకు వచ్చి అండగా నిలబడతానని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో రాజకీయ కక్షలకు తావివ్వకుండా ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేయలేదని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ కార్యకర్తలు వేధింపులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని తెలిపారు. అయితే పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని, నాయకులు, కార్యకర్తలు పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు అధ్యక్షత వహించగా, సీడీసీ మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు గడిల సుధీర్ రెడ్డి, కోడూరి రమేష్, కుందనరాజు, పట్టణ పార్టీ అధ్యక్షుడు చిలమల్లన్న, సీనియర్ నాయకులు చింత సాయినాథ్, ఆత్మకూరు నగేష్, స్థానిక సర్పంచ్ తొంట కిష్టయ్య, మాజీ సర్పంచులు లక్ష్మారెడ్డి, గడ్డమీద సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీలు సత్యనారాయణ యాదవ్, అమరేందర్ రెడ్డి, సుధాకర్, మాధవరెడ్డి, శివకుమార్, అల్లం లలిత, అహ్మద్, అశోక్, పండరి, సర్పంచులు రవికుమార్, కృష్ణారెడ్డి, సంతోష్ గౌడ్, ప్రమోద్, నవీన్ కుమార్, నాగరాజు, గుడ్ల లక్ష్మణ్, యువజన విభాగం అధ్యక్షులు నరేష్ గౌడ్, నగేష్ యాదవ్, బీఆర్ఎస్వీ ఇన్‌చార్జి శ్రీహరి, నిజాముద్దీన్, సలావుద్దీన్, పాండు నాయక్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, మాజీ సర్పంచులు మాణిక్, రాములు, దశరథ్, నగేష్, సిద్ధన్న, సంగమేష్, కరుణాకర్, సంఘన్న, శేఖర్, రాములు తదితర నాయకులు పాల్గొన్నారు.