అవినీతికి కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్
సూర్య కరీంనగర్ ;;బీఆర్ఎస్ పార్టీ అంటేనే అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని బీజేపీ సీనియర్ నాయకుడు, కార్పొరేటర్ బండారి వేణు విమర్శించారు. గత 20 ఏళ్లుగా కరీంనగర్‌లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకుల అవినీతి, భూకబ్జాలు, కాంట్రాక్టుల వ్యవహారాలు ప్రజలకు తెలుసన్నారు. తమ నాయకుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ కార్పొరేటర్లకు ప్రజలకు మంచి సేవలు అందించాలని, అవినీతికి దూరంగా ఉండాలని సూచించారని తెలిపారు.గతంలో బీఆర్ఎస్ పాలనలో కొందరు కార్పొరేటర్లు అవినీతి, భూకబ్జాలకు పాల్పడ్డారని, ప్రజలు వారిని తిరస్కరించారని పేర్కొన్నారు. తాను కూడా గతంలో బీఆర్ఎస్‌లో ఉండి అక్కడి పరిస్థితులు, నాయకుల తీరుతో విసిగిపోయి బయటకు వచ్చానన్నారు. బీజేపీ కార్పొరేటర్లపై చల్లా హరిశంకర్ నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, ఆధారాలు ఉంటే వెల్లడించాలని సవాల్ విసిరారు.నగర అభివృద్ధి కోసం మేయర్, డిప్యూటీ మేయర్, బీజేపీ కార్పొరేటర్లు సమష్టిగా పనిచేస్తున్నారని, పార్టీలకు అతీతంగా అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని బండారి వేణు స్పష్టం చేశారు.ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు సోమిడి వేణు, వంగల పవన్, తాటి ప్రభావతి, నాయకులు గాదె శివరాం తదితరులు పాల్గొన్నారు.