BREAKING
వైభవంగా పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం అలరించడానికి వస్తున్న కీర్తి సురేశ్ 'సత్యవాన్ సావిత్రి'.. ఆకట్టుకుంటున్న 'చక్కని కళ్ళ పిల్లా' సెకండ్ సింగిల్! పలమనేరు మున్సిపాలిటీపై టీడీపీ జెండా 3475 ఓట్ల ఆధిక్యంతో చైర్‌పర్సన్‌గా రాజ్యలక్ష్మి విజయం ఆత్మకూరులో ఫలించిన ఆనం వ్యూహం - మలుపు తిరిగిన రాజకీయం - బొమ్మిరెడ్డి రంగ ప్రవేశం - మున్సిపాలిటీ కైవసం నెల్లూరు రూరల్ 2వ డివిజన్‌లో టీడీపీ జయకేతనం! సబ్బవరం పరిషత్ ఎన్నికల్లో సీట్ల వివాదం... టీడీపీ తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పంచకర్ల విజయవాడ, గుంటూరులకు దీటుగా తెనాలి అభివృద్ధి చేస్తాం.... నూతన మున్సిపల్ చైర్మన్ తోటకూర మర్రిపాడులో మంత్రి ఆనం విస్తృత ఎన్నికల ప్రచారం పౌండ్‌ల్యాండ్ భవితవ్యంపై బ్రిటన్ ప్రభుత్వం ఆందోళన విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా జిల్లా స్థాయి పోటీలు బుచ్చి మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో టిడిపి హవా ఫెరారీ లూస్ ఈవీకి భారీ డిమాండ్.. 2027 నాటికి అన్ని కార్లు బుక్ పూర్తి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పురస్కారం ప్రదానం; ‘శ్వాశ్వ’ గ్రంథావిష్కరణ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌కు పాకిస్థాన్ షాహీన్స్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా అబ్దుల్ సమద్! మురసు తుఫానుతో ఉద్యాన పంటల పరిశీలన.  హెచ్ ఓ అంజలి భాయ్

అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యమైన కందిపప్పు సరఫరా చేయాలి

Select Suryaa Now
అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యమైన కందిపప్పు సరఫరా చేయాలి

మెదక్, : జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు నాణ్యమైన కందిపప్పు సరఫరా చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులను ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం సరుకులు అందించాలని స్పష్టం చేశారు.మంగళవారం మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా, శిశు, వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ నగేష్ ముఖ్య అతిథిగా పాల్గొని కందిపప్పు సరఫరాకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 1,076 అంగన్‌వాడీ కేంద్రాలకు అవసరమైన కందిపప్పును ఒక కిలో ప్యాకెట్ల రూపంలో సరఫరా చేసేందుకు గతంలోనే టెండర్లకు ఆహ్వానం పలికినట్లు తెలిపారు. ప్రభుత్వ వాణిజ్య పనుల శాఖలో నమోదైన మిల్లర్లు, టోకు వ్యాపారులు, ప్రభుత్వ సంస్థలు, ఇతర అర్హత కలిగిన వ్యాపార సంస్థల నుంచి టెండర్లను స్వీకరించినట్లు పేర్కొన్నారు.ఇందులో భాగంగా మంగళవారం టెండర్ల ప్రక్రియ నిర్వహించి, అర్హత, సామర్థ్యం కలిగిన వ్యాపారులకు కందిపప్పు సరఫరా బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కందిపప్పు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, నిర్ణీత సమయంలో సరుకులు అందించాలని గుత్తేదారులకు సూచించారు.అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, లబ్ధిదారులకు అందించే ఆహార పదార్థాల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో సంక్షేమ అధికారి హేమ భార్గవి, పౌరసరఫరాల అధికారి నిత్యానంద్, మేనేజర్ జగదీష్, డీఈఓ రాజు, రవాణా శాఖ అధికారి శ్రీకాంత్ చక్రవర్తి, సంబంధిత గుత్తేదారులు తదితరులు పాల్గొన్నారు.