BREAKING
ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన భారత్ కంది కేంద్ర కారాగారాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్ ఆవిష్కరణ మల్లంపేట నుంచి ఇండిపెండెంట్ కౌన్సిలర్ లు గా భార్య భర్తలు గెలుపు నవ్వుల పూలు పూయిస్తున్న ఈఎన్‌ఈ రిపీట్ ట్రైలర్.. థియేటర్లలో నూతన అల్లరితో రానున్న విశ్వక్ సేన్ గ్యాంగ్! దేశంలో ఐదు రెట్లు పెరగనున్న డేటా సెంటర్ సామర్థ్యం పాకిస్తాన్‌లో చుక్కలు చూపిస్తున్న గ్యాస్ ధరలు ఈ అద్భుత విజయం మీదే.. ఎప్పటికీ మీ శిష్యులమే! జాతీయవాదుల సంగమం కు తరలివెళ్లిన జగిత్యాల పూర్వ ఏబీవీపీ నాయకులు 2029 నాటికి రూ. 3 లక్షల కోట్లకు రక్షణ ఉత్పత్తి ప్రత్తిపాడు: మెరుసు తుఫాను ప్రభావం..విద్యుత్ సిబ్బంది అష్ట కష్టాలు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి కలెక్టర్ బి. సత్య ప్రసాద్ డంప్ యార్డ్ నిర్వహణ లోపాలపై అధికారులపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆగ్రహం! ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సాధారణ పరిశీలకులతో చర్చించిన సబ్ కలెక్టర్ మూడు మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలి.

అపోలో ఆసుపత్రికి అరుదైన ఘనత

Select Suryaa Now
అపోలో ఆసుపత్రికి అరుదైన ఘనత

ఆరిలోవ, సూర్య : విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రి ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి, ప్రొఫెసర్ డాక్టర్. అబ్దుల్ డి. ఖాన్ సమర్పించిన ఏడు వైద్య పరిశోధనా పత్రాలు ప్రతిష్టాత్మక డాక్టర్ కె.వి. శ్రీవాస్తవ మెడల్ అవార్డు విభాగంలో ప్రదర్శనకు ఎంపికయ్యాయి. డిసెంబర్ లో అహ్మదాబాద్ లో జరగనున్న ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ వార్షిక జాతీయ సదస్సు (ఐఓఏసిఓఎన్)లో ఈ పరిశోధనా పత్రాలను ప్రదర్శించనున్నారు.ఒకే వైద్యుడు సమర్పించిన ఏడు పరిశోధనా పత్రాలూ ఈ పురస్కార విభాగంలో ప్రదర్శనకు ఎంపిక కావడం అరుదైన ఘనతగా వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ శాస్త్రీయ కమిటీ అధికారికంగా ఎంపిక సమాచారాన్ని లేఖ ద్వారా తెలియజేసింది.మోకాలు, భుజం కీళ్లకు సంబంధించిన ఆధునిక ఆర్థ్రోస్కోపిక్ చికిత్సా విధానాలపై రెండేళ్ల ఫాలోఅప్ ఫలితాలను ఈ పరిశోధనలు వివరిస్తున్నాయి. మెనిస్కన్ రివర్, ఏసిఎల్ రీకన్స్ట్రక్షన్, రొటేటర్ కఫ్ రిపేర్ వంటి శస్త్రచికిత్సల ఫలితాలతో పాటు, మోకాలు, తుంటి కీళ్ల అరిగిపోవడం చికిత్సలో ఆర్థోబయాలజిక్స్ వినియోగంపై స్వల్పకాలిక ఫలితాలను కూడా పరిశోధకులు విశ్లేషించారు.
ఈ చికిత్సలు పొందిన రోగులందరిలో మంచి పనితీరు, కదలికల సామర్థ్యం మెరుగుపడినట్లు పరిశోధనల్లో వెల్లడైంది. అందించిన వైద్య సేవల పట్ల రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తూ అపోలో ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా అపోలో ఆసుపత్రి విశాఖపట్నం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, ఈ గుర్తింపు ఆధునాతన ఆర్థోపెడిక్ చికిత్సలు, వైద్య పరిశోధనలు, విద్యా రంగంలో అపోలో ఆసుపత్రి అందిస్తున్న సేవలకు నిదర్శనమని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఆసుపత్రి ఆర్థోపెడిక్స్ విభాగానికి ఈ ఘనత గుర్తింపు తీసుకువచ్చిందని తెలిపారు.