BREAKING
ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన భారత్ కంది కేంద్ర కారాగారాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్ ఆవిష్కరణ మల్లంపేట నుంచి ఇండిపెండెంట్ కౌన్సిలర్ లు గా భార్య భర్తలు గెలుపు నవ్వుల పూలు పూయిస్తున్న ఈఎన్‌ఈ రిపీట్ ట్రైలర్.. థియేటర్లలో నూతన అల్లరితో రానున్న విశ్వక్ సేన్ గ్యాంగ్! దేశంలో ఐదు రెట్లు పెరగనున్న డేటా సెంటర్ సామర్థ్యం పాకిస్తాన్‌లో చుక్కలు చూపిస్తున్న గ్యాస్ ధరలు ఈ అద్భుత విజయం మీదే.. ఎప్పటికీ మీ శిష్యులమే! జాతీయవాదుల సంగమం కు తరలివెళ్లిన జగిత్యాల పూర్వ ఏబీవీపీ నాయకులు 2029 నాటికి రూ. 3 లక్షల కోట్లకు రక్షణ ఉత్పత్తి ప్రత్తిపాడు: మెరుసు తుఫాను ప్రభావం..విద్యుత్ సిబ్బంది అష్ట కష్టాలు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి కలెక్టర్ బి. సత్య ప్రసాద్ డంప్ యార్డ్ నిర్వహణ లోపాలపై అధికారులపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆగ్రహం! ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సాధారణ పరిశీలకులతో చర్చించిన సబ్ కలెక్టర్ మూడు మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలి.

ఆర్టీసీ డిపోలో ఘనంగా జల సంరక్షణ దినోత్సవం

Select Suryaa Now
ఆర్టీసీ డిపోలో ఘనంగా జల సంరక్షణ దినోత్సవం

​కావలి, మేజర్ న్యూస్ :  నీటిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా పొదుపు చేయాలని కావలి ఎపీఎస్‌ఆర్టీసీ డిపో మేనేజర్ డి. ఆదినారాయణ పిలుపునిచ్చారు. 'బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాలు'లో భాగంగా మంగళవారం కావలి ఆర్టీసీ డిపోలో జల సంరక్షణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
​ఈ సందర్భంగా డిఎం ఆదినారాయణ మాట్లాడుతూ, దైనందిన జీవితంలో చిన్న చిన్న మార్పుల ద్వారా వేలాది లీటర్ల నీటిని ఆదా చేయవచ్చని తెలిపారు. ఇళ్లు, గ్యారేజీలు, బస్టాండ్లలో ట్యాంకులు, కుళాయిల లీకేజీలను వెంటనే అరికట్టాలని సూచించారు. వాహనాలను నేరుగా పైపులతో కాకుండా బకెట్, తడిగుడ్డతో శుభ్రం చేయాలని, ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకుని భూగర్భ జలాలను పెంపొందించాలని కోరారు.  ​అనంతరం సిబ్బందితో నీటి పొదుపుపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ ఎస్.కె. ఖాజా మొహిద్దీన్, సీనియర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎం. రామకృష్ణ, బస్టేషన్ సూపర్‌వైజర్ డి. రవిప్రకాష్, మెకానిక్ సూపర్‌వైజర్లు నజీర్ ఖాన్, నవాజ్ బేగ్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.