మండలంలో 158 పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ .
వింజమూరు మేజర్ న్యూస్ : వింజమూరు మండల పరిధిలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన మొత్తం 158 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఆర్వో ఎం. శేషగిరిరావు తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుంచి 3వ తేదీ సాయంత్రం వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగిందని ఆయన వెల్లడించారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ ప్రక్రియలో మొత్తం 158 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారని ఆర్వో శేషగిరిరావు వివరించారు.