ప్రచారంలో విజయవంతంగా .... టిడిపి ఎంపీటీసీఅభ్యర్థి రేవతి.
ముత్తుకూరు, మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులు దూసుకెళ్లారు. కృష్ణపట్నం ఎంపీటీసీ స్థానం బిట్ -1 టిడిపి అభ్యర్థి గూడలి రేవతి ఎన్నికల ప్రచారంలో విజయవంతంగా ముందుకు సాగారు. తన ఎన్నికల ప్రచారాన్ని సక్సెస్ ఫుల్ గా ముగించారు. ఎన్నికల ప్రచారం మొదలుకొని చివరి వరకు ఓటర్ల ఆదరణ పొందుతూ ఇంటింటి ప్రచారంలో సత్తా చాటారు. ఈ సెగ్మెంట్ పరిధిలోని ఓటర్లు జై సైకిల్ అనే విధంగా ఓటర్లను ఆకర్షిస్తూ ప్రచారం సాగించారు. మహిళలు, యువతీ, యువకులు, వృద్ధులు , విద్యావంతులు, వ్యాపారస్తులు ఆమెను ఆదరించారు. తొలిసారి మండల రాజకీయాల్లో ప్రవేశిస్తూ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతోపాటు మండల పార్టీ నాయకులు సూచనలు సలహాలు పాటిస్తూ కృష్ణపట్నం గ్రామస్తుల అభిమానం తో పాటు స్థానిక నాయకులు రాగాల శివకృష్ణ, మామిడాల శ్రీనివాసులు, పసుపులేటి గోవిందయ్య, కారంచేటి శివరామ ప్రసాద్ శర్మ, తొండమనాటి వెంకటాద్రి, పెద్దపాలెం సురేష్, పెద్దపాలెం హరి ప్రసాద్, పెద్దపాలెం రాజా, కట్టా సుబ్బయ్య, కట్టాగోపి, వాకాటి సుబ్బయ్య, గాడిమేని సుబ్రహ్మణ్యం అదే విధంగా పార్టీ కార్యకర్తలు, అనుబంధ సంఘాలు ఎన్నికల ప్రచారానికి పూర్తిస్థాయిలో దోహదం చేయడం జరిగింది. బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఆమె పోటీలో ఉండడంవల్ల ఓటర్లు అభిమానం చూపుతూ గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంటింటి ప్రచారంలో కరపత్రాలు అందజేసి సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేయగా ఓటర్లు సై అన్నారు. కూటమి ప్రభుత్వ పరిపాలనలో గ్రామానికి చేపట్టిన అభివృద్ధి తోపాటు సంక్షేమ పథకాలు గురించి ఇంటింటికి వివరించారు. ఈ సెగ్మెంట్లో టిడిపి తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ ఓటర్లు అధిక భాగం తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నారు.