BREAKING
ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన భారత్ కంది కేంద్ర కారాగారాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ పోస్టర్ ఆవిష్కరణ మల్లంపేట నుంచి ఇండిపెండెంట్ కౌన్సిలర్ లు గా భార్య భర్తలు గెలుపు నవ్వుల పూలు పూయిస్తున్న ఈఎన్‌ఈ రిపీట్ ట్రైలర్.. థియేటర్లలో నూతన అల్లరితో రానున్న విశ్వక్ సేన్ గ్యాంగ్! దేశంలో ఐదు రెట్లు పెరగనున్న డేటా సెంటర్ సామర్థ్యం పాకిస్తాన్‌లో చుక్కలు చూపిస్తున్న గ్యాస్ ధరలు ఈ అద్భుత విజయం మీదే.. ఎప్పటికీ మీ శిష్యులమే! జాతీయవాదుల సంగమం కు తరలివెళ్లిన జగిత్యాల పూర్వ ఏబీవీపీ నాయకులు 2029 నాటికి రూ. 3 లక్షల కోట్లకు రక్షణ ఉత్పత్తి ప్రత్తిపాడు: మెరుసు తుఫాను ప్రభావం..విద్యుత్ సిబ్బంది అష్ట కష్టాలు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి కలెక్టర్ బి. సత్య ప్రసాద్ డంప్ యార్డ్ నిర్వహణ లోపాలపై అధికారులపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆగ్రహం! ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై సాధారణ పరిశీలకులతో చర్చించిన సబ్ కలెక్టర్ మూడు మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలి.

పరిషత్‌ పోలింగ్‌కు స్థానిక సెలవులు * కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఉత్తర్వులు *

Select Suryaa Now
పరిషత్‌ పోలింగ్‌కు స్థానిక సెలవులు   * కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఉత్తర్వులు *

శ్రీకాకుళం, సూర్య : జిల్లాలో నవంబర్‌ 5వ తేదీన జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ సాధారణ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో స్థానిక సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్‌ కేంద్రాలుగా కేటాయించిన ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, విద్యాసంస్థలకు పోలింగ్‌ ముందు రోజైన నవంబర్‌ 4, పోలింగ్‌ రోజైన నవంబర్‌ 5వ తేదీల్లో (రెండు రోజులు) స్థానిక సెలవు ప్రకటించారు. పోలింగ్‌ సామగ్రి పంపిణీ, బూత్‌ల ఏర్పాటుకు అనువుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నికలు జరిగే పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థలకు నవంబర్‌ 5వ తేదీన స్థానిక సెలవు అమల్లో ఉంటుందని కలెక్టర్‌ స్పష్టం చేశారు. అలాగే నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌-1881, ఏపీ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ యాక్ట్‌-1988 నిబంధనల ప్రకారం.. జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు, కర్మాగారాలు, వ్యాపార, వాణిజ్య దుకాణాల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా నవంబర్‌ 5న వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని యజమాన్యాలను ఆదేశించారు. ఉద్యోగులకు ఓటు హక్కు కల్పించడంలో ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.