BREAKING
భారత్-ఇజ్రాయిల్ బంధంపై పాక్ ఆర్మీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు గాజు గ్లాసుకు ఓటు గుద్ది.... గొడ్డల పార్టీకి బుద్ధి చెప్పండి సెన్సార్ బోర్డ్ కొత్త నిబంధనలపై దర్శకుడు హనీ త్రిపాఠి తీవ్ర ఆగ్రహం.. అది పూర్తి నియంతృత్వమేనంటూ సంచలన వ్యాఖ్యలు! సుప్రీంకోర్టు పేరుతో నకిలీ వెబ్‌సైట్ సృష్టించిన సైబర్ కేటుగాళ్లు: అప్రమత్తంగా ఉండాలని కోర్టు రిజిస్ట్రీ హెచ్చరిక రామాయణం సాంగ్ విమర్శలపై స్పందించిన సింగర్ అర్మాన్ మాలిక్.. సంగీతంపై ఎవరి అభిప్రాయాలు వారివంటూ కౌంటర్! మురసు తుఫాను నేపథ్యంలో 11 పునరావాస కేంద్రాల ఏర్పాటు ప్రజలకు తాగునీరు, భోజన వసతి కల్పిస్తాం – తహసీల్దార్ జి. నాగరాజు పలమనేరు మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీ అభ్యర్థి సి. రాజ్యలక్ష్మి ఘన విజయం! వైసీపీ గడపలో పసుపు జెండా.. పులివెందుల మున్సిపాలిటీని కైవసం చేసుకున్న టీడీపీ! షారుఖ్ ఖాన్ కింగ్ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ సంచలనం.. రూ. 665 కోట్ల భారీ వ్యాపారం! ఆత్మకూరు మున్సిపాలిటీ తెలుగుదేశం కైవసం మంత్రి నారాయణ ఆశీస్సులతో.. 2,545 ఓట్ల భారీ మెజార్టీతో కొండా గీతిక ఘనవిజయం! కడప కార్పొరేషన్ కౌంటింగ్ కేంద్రంలో కొనసాగుతున్న తర్జనభర్జన టాలీవుడ్‌పై రాధికా ఆప్టే వ్యాఖ్యలు.. గట్టి కౌంటర్ ఇస్తున్న నందమూరి అభిమానులు! సర్వేపల్లిలో ఐదు జెడ్పీటీసీలతో పాటు ఐదు ఎంపీపీలు మావే కూటమి ప్రభుత్వ మోసాలకు చరమగీతం పాడాలి: డాక్టర్ కృష్ణ చైతన్య

శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు అధికారులు పాత రేగ దుప్పలపూడి గ్రామాల్లో విస్తృత పర్యటన

Select Suryaa Now
శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసు అధికారులు పాత రేగ దుప్పలపూడి గ్రామాల్లో విస్తృత పర్యటన

రామభద్రపురం, సూర్య :  స్థానిక ఎన్నికలలో ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలు భాగంగా గ్రామాల్లో శాంతిభద్రతుల పరిరక్షణకు పోలీసు అధికారులు విస్తృత పర్యటన చేశారు. మంగళవారంబొబ్బిలి సిఐ ఆర్ .మల్లికార్జునరావు ఎస్సై జ్ఞాన ప్రసాద్ సంయుక్తంగా దుప్పలపూడి పాత రేగ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి స్థానిక నాయకులు గ్రామస్తులతో మాట్లాడారు. గతంలో వివాదాలు ప్రస్తుత పరిస్థితులు ఎన్నికల సందర్భంగా ఆ సమస్యలపై ప్రజలకు సీఐ మల్లికార్జున రావు సవివరంగా అందించారు. ఎంపీటీసీ జడ్పిటిసి పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే లా ప్రజల సహకరించాలన్నారు. అందుకు ప్రతిష్టాత్మక మైన ముందస్తు చర్యలు చేపట్టినట్టు ఆయన వివరించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి ప్రత్యేకంగా ఉంచడంతో పాటు ఇప్పటికే  తెలియజేశారు. మఖ్యంగా సమస్యాత్మక గ్రామాలు పాతరేగరొంపల్లికొండ కెంగువ రామభద్రపురం సీతారాంపురం తారాపురం గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. పోలీస్ సిబ్బంది నిత్యo గ్రామాల్లో పర్యటిస్తూ స్థానిక పరిస్థితులపై సమాచారం సేకరించి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు పేర్కొన్నారు .ఎన్నికల సమయంలో వర్గ భేదాలు రెచ్చగొట్టడం ఓటర్లను బెదిరించడం ఘర్షణ సృష్టించడం వంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీ ఎలిమెంట్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని అవసరమైతే చట్ట ప్రకారం ముందస్తు అరెస్టులు కూడా చేస్తామని అందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. సోషల్ మీడియా పోస్టలు విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వ్యక్తిగత దూషణలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు అసత్య ప్రచారాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలని అనుమానస్పద కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారితోపాట ఎస్సై జ్ఞాన ప్రసాద్ పోలీసులు గ్రామాలు పెద్దలు యువత పాల్గొన్నారు.