BREAKING
గేమింగ్ రంగంలోకి సూపర్‌స్టార్ మహేశ్ బాబు గ్రాండ్ ఎంట్రీ.. 2028లో భారీ యాక్షన్ అడ్వెంచర్ గేమ్‌తో ప్రేక్షకుల ముందుకు! విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి అండ రాయికోడ్ జెడ్పిహెచ్ఎస్ లో స్కూల్ కాంప్లెక్స్ సమావేశం దీపావళి కానుకగా 'మూకుతి అమ్మన్ 2' విడుదల.. చెన్నై ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నటి నయనతార! పటాన్‌చెరు ఎంపీపీ షాపింగ్ కాంప్లెక్స్ షట్టర్‌కు వేలం ఖజానా ఖాళీ.. పంచాయతీల్లో పాలన కుదేలు! అభివృద్ధిలో మునిదేవునిపల్లి ముందడుగు! గ్రామాభివృద్ధికి సర్పంచ్‌ కృష్ణ ప్రత్యేక చొరవ అవోపా శాశ్వత నిధి కింద విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ ఏళ్ల తరబడి విద్యుత్ సమస్యకు పరిష్కారం.. సర్పంచ్ చొరవతో గ్రామస్తులకు ఊరట బీఎస్పీ సీనియర్ నాయకుడు నర్సింలు మృతి మాదిగ ఉద్యోగుల సమాఖ్య సంగారెడ్డి జిల్లా నూతన కమిటీ ఎన్నిక కూటమికి బుద్ధి రావాలంటే వైసీపీకి ఓటెయ్యాలి * ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ * ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థులను గెలిపించండి............. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వాటర్ గ్రిడ్ పనులు గడువులోగా పూర్తి చేయాలి – కలెక్టర్ నిశాంత్ కుమార్ ఎంపీపీ రేసులో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గాత్రం సౌమ్యశ్రీ

గాజు గ్లాసుకు ఓటు గుద్ది.... గొడ్డల పార్టీకి బుద్ధి చెప్పండి

Select Suryaa Now
గాజు గ్లాసుకు ఓటు గుద్ది.... గొడ్డల పార్టీకి బుద్ధి చెప్పండి

సీతంపేట, సూర్య : గాజుగ్లాసుకు ఓటేసీ గొడ్డలి పార్టీకి బుద్ది చెప్పాలనీ ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ పిలుపునిచ్చారు.మంగళవారం సీతంపేట లో జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు, పార్టీలు తరుపున పోటీ చేస్తున్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీ అభ్యర్ధి ఇమరిక పవన్ తదితరులు ఆధ్వర్యంలో సీతంపేట పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. సీతంపేట మండలంలోని జనసైనికులు, మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ మాట్లాడుతూ గాజుగ్లాస్ గుర్తుకు ఓటేసి గొడ్డల పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జనసేన, టీడీపీ తరుపున పోటీ చేస్తున్న ఎంపీటీసీలు, జెడ్ పీటీసీ అభ్యర్ధిగా ఇమరిక పవన్ కు గాజు గ్లాసుకు ఓటు వేసి సీతంపేట మండలం లో జనసేన జెండా ఎగర వేయాలన్నారు. తల్లిని చెల్లినీ బయటకు పంపి అక్రమాస్తులు కూ డబెట్టున్నారని ఆమె ఆరోపించారు.ఉపముఖ్యమంత్రి పవన్  కళ్యాణ్ అక్కడ ఉంటే ఈ పవన్ మీకు అండగా ఉంటారన్నారు .మాట్లాడి జన సైనికుల్లో ఉత్సాహం నింపారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. రెండేళ్లలో ఏపని కావాలన్నా తను సిద్ధంగా ఉన్నానని స్థానికి కూటమి జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ హామీఇచ్చారు. మండలంలో బీటీ, సీసీ రోడ్లు వేయంచామని గుర్తు చేశారు. ఇంకా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలన్నారు. ఎంపీటీసీ అభ్యర్ధులకు, జెడ్పీటీసీ అభ్యర్ధి ఇమరిక పవన్ కు గాజుగ్లాస్ పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. గతంలో గాజు గ్లాసు కి ఓటు వేసి నన్ను గెలిపించారని అలాగే పవన్ ను గ్లాసుకు ఓటు వేసి గెలిపించాలని ఎమ్మెల్యే జయకృష్ణ అన్నారు. పాలకొండ నియోజకవర్గ టిడిపి ఇంచార్జి పడా ల భూదేవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన కళ్యాణ్ నేతృత్వంలో పాలన ముందుకు సాగుతుందని ఆమె అన్నారు. అధిష్టానం ఆదేశాలు ప్రకారం కూటమి అభ్యర్ధులు విజయానికి కృషి చేస్తామని భూదేవి స్పష్టం చేశారు. గాజు గ్లాసు కు ఓటేసి ఎంపీటీసీ అభ్యర్ధులను, జెడ్ పీటీసి అభ్యర్ధిగా పోటీచేస్తున ఇమరిక పవన్ ను గెలిపించాలని ఆమె పిలుపు నిచ్చారు. అభ్యర్ధి ఇమరిక పవన్ మాట్లాడుతూ నా విజయం కోసం మండలం నుండి పెద్ద ఎత్తున  వచ్చిన నా అభిమానులందరికీ పాదాభివందనమన్నారు. తొలుత సంత్ తోట నుండి ఊరేగింపుగా వచ్చి తదుపరి ప్రచార రథంపై ప్రసంగించారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ అభ్యర్ధులు ఆరిక గౌతమి, పొదిలాపు వనజాక్షి, క డ్రక కావ్య, ఎస్ లక్ష్మీ, ఎక్స్ ఎంపీపీ మాలయ్యా, ప్రసాద్, జనార్దన, క్రిష్ణ, కోటి, సందీప్, అశోక్. సీ తంపేట మండలం నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు, మహిళలు గాజు గ్లాసు జెండాతో ఊరేగింపులో పాల్గొన్నారు.