భారత్-ఇజ్రాయిల్ బంధంపై పాక్ ఆర్మీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు
భారత్, ఇజ్రాయిల్ మధ్య వేగంగా పెరుగుతున్న రక్షణ సంబంధాలు ముస్లిం దేశాలకు, ముఖ్యంగా పాకిస్థాన్‌కు తీవ్ర ముప్పుగా మారుతున్నాయని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 26న ఇరాన్ రాజధాని టెహ్రాన్ వేదికగా జరిగిన అత్యున్నత స్థాయి భద్రతా సమావేశంలో ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ఇరాన్ భద్రతా అధికారి మొహ్సేన్ రెజాయీ వెల్లడించారు.
భారత్ (హిందువులు), ఇజ్రాయిల్ (యూదులు) మధ్య రూపుదిద్దుకుంటున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని 'హిందూ-యూదు కూటమి'గా అభివర్ణించిన అసిమ్ మునీర్, ఈ పెరుగుతున్న రక్షణ మరియు నిఘా బంధం ముస్లిం ప్రపంచానికి అలాగే పాకిస్థాన్‌కు తీవ్ర ప్రతికూలంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్, సౌదీ అరేబియా, టర్కీకి చెందిన కీలక భద్రతా ప్రతినిధులు హాజరైన ఈ వేదికపై ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.