BREAKING
ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనం ఎస్సై బాలరాజు అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల సునామీ: సెనేట్, హౌస్ రెండూ వారివే సంక్షేమం అభివృద్ధి ఇవే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించాలి మార్గం మధ్యలో 108 లో మహిళ ప్రసవం. అభివృద్ధి సంక్షేమం ఇవే కూటమి ప్రధాన లక్ష్యం సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అమిత్ షాకు జగ్గారెడ్డి కౌంటర్.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే మా లక్ష్యం! అప్పుల బాధతో ఉపాధ్యాయుడి ఆత్మహత్య కుల బహిష్కరణ కేసులో సంచలన తీర్పు. ...ఐదుగురికి ఐదేళ్ల జైలు శిక్ష. ఎంపీడీవో కు, వినతి పత్రం అందజేత ఏఎంసీ చైర్మన్,వైస్ చైర్మన్ ను సన్మానించిన... -సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీకాంత్ ఎంపీటీసీ జెడ్పీటీసీ పోలింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. *ప్రొఫెసర్ కోదండరాం నివాసంలో విద్యుత్ జేఏసీ నాయకుడు ప్రశాంత్ జన్మదిన వేడుకలు* టిడిపి తోనే అభివృద్ధి సంక్షేమం.

గుడిపేట రాబరీ కేసును ఛేదించిన పోలీసులు.. ఇద్దరు అరెస్ట్

Select Suryaa Now
గుడిపేట రాబరీ కేసును ఛేదించిన పోలీసులు.. ఇద్దరు అరెస్ట్

సూర్య, మంచిర్యాల: హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలో ఒంటరిగా ఉన్న మహిళ మెడలోని బంగారు పుస్తెలతాడును బలవంతంగా లాక్కొని పరారైన ఘటనలో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు బుధవారం వెల్లడించారు.పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 2న ఉదయం 11 గంటల సమయంలో గుడిపేట గ్రామానికి చెందిన లగిశెట్టి దేవక్క ఇంటి ముందు ఉండగా, స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు రాకేశ్ ఇంటి చిరునామా అడిగారు. అనంతరం ఆమెను ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకుని, గొంతు పట్టుకుని, అరిస్తే చంపుతామని బెదిరించారు. ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడును బలవంతంగా లాక్కొని కింద పడేసి స్కూటీపై పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు హాజీపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఆర్థిక ఇబ్బందులు, అప్పుల కారణంగా దొంగతనానికి పాల్పడాలని నిర్ణయించుకున్న నిందితులు ముందుగా మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. ఈ క్రమంలో గుడిపేటలో ఒంటరిగా ఉన్న దేవక్కను లక్ష్యంగా చేసుకుని పథకం ప్రకారం పుస్తెలతాడును అపహరించారు.అనంతరం చాకటి అనిల్ కుమార్ సహాయంతో మంచిర్యాల పట్టణంలోని ఆర్.పీ. రోడ్డులో మున్సిపల్ కార్యాలయ వాటర్ ట్యాంకు సమీపంలోని వర్క్‌షాప్‌లో బంగారు పుస్తెలతాడును కరిగించి మూడు ముద్దలుగా తయారు చేసుకున్నారు. వాటిని ముగ్గురూ పంచుకున్నారు.ఈ కేసులో డోలె చంద్రకాంత్ (32), చాకటి అనిల్ కుమార్ (35)లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు ముత్యబోయిన ప్రేమ్ చందు పరారీలో ఉన్నాడు.వాహనాలు, బంగారం స్వాధీనం.అరెస్టయిన చంద్రకాంత్ వద్ద ఒక బంగారు ముక్క, నేరానికి ఉపయోగించిన సుజుకి అవెనిస్ స్కూటీ, రెడ్‌మీ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనిల్ కుమార్ వద్ద ఒక బంగారు ముక్క, హోండా యాక్టివా స్కూటీ, శామ్‌సంగ్ సెల్‌ఫోన్‌తో పాటు బంగారం కరిగించేందుకు ఉపయోగించే మూస, పట్టుకారును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సాంకేతిక పరిజ్ఞానం, పక్కా నిఘాతో తక్కువ సమయంలోనే కేసును ఛేదించారు. దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన మంచిర్యాల రూరల్ సీఐ జి. రవీందర్, హాజీపూర్ ఎస్‌ఐ డి. కిరణ్ కుమార్, సీసీసీ నస్పూర్ ఎస్‌ఐ-2 టీ. జితేందర్ సింగ్, ఏఎస్ఐ ఎం.డి. ఇజాజ్, పోలీస్ కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.