*ప్రొఫెసర్ కోదండరాం నివాసంలో విద్యుత్ జేఏసీ నాయకుడు ప్రశాంత్ జన్మదిన వేడుకలు*
కోహిర్;తెలంగాణ ఉద్యమ రథసారథి, శాసనమండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం నివాసంలో ప్రశాంత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ తన జన్మదిన వేడుకలను ప్రొఫెసర్ కోదండరాం నివాసంలో జరుపుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రొఫెసర్ కోదండరాం సమక్షంలో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం తనకు ఎంతో ఆనందంగా, ప్రత్యేకంగా ఉందని ప్రశాంత్ పేర్కొన్నారు.