రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
కొల్చారం;ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగుల గారి మల్లేశం గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సర్పంచ్ దేవన్నగారి శేఖర్, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో పాటు అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.వరి కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన, నిల్వ ఉంచిన ధాన్యం భారీ వర్షాలకు తడిసి రైతులు నష్టపోయారని అన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు అధైర్యపడవద్దని, ప్రజా పాలన ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల ద్వారా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.ధాన్యం తడిసిందనే కారణంతో రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని వారు పేర్కొన్నారు.