52 కేంద్రాల్లో ఓటు వినియోగించుకోవచ్చు: చీరాల ఆర్డీవో నరసింహం
ఇంకొల్లు, మేజర్ న్యూస్:
ఇంకొల్లు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా 52 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఇంకొల్లు మండల ఎన్నికల అధికారి కే రమేష్ బాబు వివరించారు. 62 మంది ఏపీవోలు, 248 మంది ఓ పి ఓ లు మొత్తం 362 మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారన్నారు. ఇంకొల్లు ఎంఆర్ఎఫ్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు అందజేసి ఆయా పోలింగ్ బూత్ లకు చేరవేశారు. ఎన్నికల ఏర్పాట్లను చీరాల ఆర్డీవో నరసింహం ఇంకొల్లు మండల ఎన్నికల అధికారి కె రమేష్ బాబు, ఇంకొల్లు మండల తహసిల్దార్ ఏ వి ఎస్ శ్రీనివాస్, ఎంపీడీవో జి శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. అందరూ ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆర్డిఓ సూచించారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానీ భాష, ఇంకొల్లు.