పేట స్వర్ణకార సంఘం అధ్యక్షులుగా నరసింహ చారి.
కొల్చారం;మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని పైతర గ్రామంలో బుధవారం కేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూ సుపోషణ, భూ సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు తక్కువ నీటితో సాగు చేసుకునే ఆరు తడి పంటలైన జొన్న, మొక్కజొన్న, కుసుమ, పొద్దుతిరుగుడు, అపరాలు తదితర పంటలను సాగు చేయాలని సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడుకోవాలని తెలిపారు.సమగ్ర పోషక యాజమాన్య పద్ధతుల్లో భాగంగా పచ్చిరొట్ట ఎరువులు, జీవ ఎరువులు, సూక్ష్మ పోషకాలను వినియోగిస్తూ నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని వివరించారు. అలాగే మట్టి నమూనాల సేకరణ, భూసార పరీక్షల విధానం, వాటి ప్రయోజనాలను రైతులకు తెలియజేశారు. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా పంటలకు అవసరమైన పోషకాలను అందించి, సమతుల్య ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్వేత, తునికి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి, గ్రామ ఉపసర్పంచ్ ఆరట్ల సుధాకర్, వ్యవసాయ విస్తరణ అధికారి అమృత్, గ్రామ ప్రజాప్రతినిధులు, రైతు సోదరులు పాల్గొన్నారు.