BREAKING
పనబాక లక్ష్మీ ని కలిసిన కార్పొరేటర్ బట్టే వెంకట కీర్తి సరికొత్త గెటప్‌లో ఆకట్టుకుంటున్న శ్రీలీల.. ధనుష్ 'ఓమ్' చిత్రం నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్! రావులపాలెంలో కుండపోత వర్షం.. జలమయమైన ప్రధాన రహదారులు కూటమి విజయంలో బీసీల భాగస్వామ్యం భేష్ : మదనపల్లి చైర్మన్ శ్రీరామ్ చినబాబుకు శుభాకాంక్షలు : బీసీహెచ్పిఎస్ అధ్యక్షులు బోడెం రాజశేఖర్ వెల్లడి ఆత్రేయపురంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం రామాయణం సినిమాపై నిర్మాత దిల్ రాజు ప్రశంసలు.. విజువల్ వండర్ అంటూ రివ్యూ! పెరవలి మండలం లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి ఆకుకూరలు వారానికి ఎన్నిసార్లు తినాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే! వర్షం సాక్షిగా ఎన్నికల ఏర్పాట్లు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – ఎన్నికల అధికారి వర్షం సాక్షిగా ఎన్నికల ఏర్పాట్లు. జోరువానలోనూ అధికారుల కసరత్తు - ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – ఎన్నికల అధికారి కాషాయ తీర్థం పుచ్చుకున్న వైసిపి నాయకులు. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. ఓటీటీలోకి సూపర్‌స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2'.. ఆ ప్రత్యేకతతో డిజిటల్ స్ట్రీమింగ్‌కు రంగం సిద్ధం! ఐదుమండలాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి, ఎమ్మెల్యే ఎమ్మెల్యే అమిలినేని. నా జీవితంలో ఎదురైన ఆ చేదు అనుభవం అదే.. ప్రముఖ సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు! అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా చేస్తాం

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి..జిల్లా ఎన్నికల పరిశీలకురాలు పి ప్రశాంతి, ఐఏఎస్

Select Suryaa Now
సమస్యాత్మక  పోలింగ్ కేంద్రాలను గుర్తించి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి..జిల్లా ఎన్నికల  పరిశీలకురాలు  పి ప్రశాంతి, ఐఏఎస్

అమలాపురం మేజర్ న్యూస్ :ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు పి. ప్రశాంతి, ఐఏఎస్ అధికారులను ఆదేశించారు.
బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలం లక్కవరం గ్రామంలో దొడ్డ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలింగ్ నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లు, పోలింగ్ సిబ్బందికి అవసరమైన సదుపాయాలు, పోలీసు భద్రతా చర్యలు, పోలింగ్ కేంద్రాల్లో టేబుళ్ల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు మాట్లాడుతూ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపట్టి ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ తనిఖీలో సర్వే అండ్ ల్యాండ్స్ ఏడీ డి. ప్రభాకర్ రావు, మలికిపురం తహసీల్దార్ కె. రాజకిషోర్, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.