BREAKING
ఆకుకూరలు వారానికి ఎన్నిసార్లు తినాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే! వర్షం సాక్షిగా ఎన్నికల ఏర్పాట్లు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – ఎన్నికల అధికారి వర్షం సాక్షిగా ఎన్నికల ఏర్పాట్లు. జోరువానలోనూ అధికారుల కసరత్తు - ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – ఎన్నికల అధికారి కాషాయ తీర్థం పుచ్చుకున్న వైసిపి నాయకులు. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. ఓటీటీలోకి సూపర్‌స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2'.. ఆ ప్రత్యేకతతో డిజిటల్ స్ట్రీమింగ్‌కు రంగం సిద్ధం! ఐదుమండలాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి, ఎమ్మెల్యే ఎమ్మెల్యే అమిలినేని. నా జీవితంలో ఎదురైన ఆ చేదు అనుభవం అదే.. ప్రముఖ సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు! అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా చేస్తాం త్వరలో ఓటీటీ వేదికగా అలరించనున్న జ్యోతిరాయ్ 'కిల్లర్' సినిమా.. పూర్తి వివరాలు ఇవే! వదలని మురసు.. చెరువులను తలపిస్తున్న రహదారులు. వేంసూరు రైతులకు సాగు నీటి వరం పోలింగ్కు సర్వం సిద్ధం పనబాక లక్ష్మి దంపతుల ఆశీస్సులు స్వీకరించిన కార్పొరేటర్ నాగభూషణం స్థానిక ఎన్నికలకు అంతా రెడీ శాసనమండలి మాజీ ఛైర్మన్ డాక్టర్ చక్రపాణి మృతి:

రేణిగుంటలో ఓటర్ స్లిప్పుల బీఎల్వోలు ఇవ్వలేదని ఓటర్ల ఆగ్రహం..

Select Suryaa Now
రేణిగుంటలో ఓటర్ స్లిప్పుల  బీఎల్వోలు  ఇవ్వలేదని ఓటర్ల ఆగ్రహం..

రేణిగుంట మేజర్ న్యూస్: రేణిగుంట మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ స్లిప్పుల పంపిణీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పోలింగ్ సమయం సమీపిస్తున్నప్పటికీ బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) తమకు ఓటర్ స్లిప్పులు అందించలేదని పలువురు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు.  మండలవ్యాప్తంగా ఓటర్ స్లిప్పుల పంపిణీ సక్రమంగా జరగకపోవడానికి కారణమేమిటి? ఎన్నికల అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారా? బీఎల్వోల పనితీరును సమీక్షిస్తున్నారా..? అంటూ ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు ఓటర్ స్లిప్పుల పంపిణీని ఎందుకు విస్మరించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఓటర్లకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.