BREAKING
ఆకుకూరలు వారానికి ఎన్నిసార్లు తినాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే! వర్షం సాక్షిగా ఎన్నికల ఏర్పాట్లు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – ఎన్నికల అధికారి వర్షం సాక్షిగా ఎన్నికల ఏర్పాట్లు. జోరువానలోనూ అధికారుల కసరత్తు - ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – ఎన్నికల అధికారి కాషాయ తీర్థం పుచ్చుకున్న వైసిపి నాయకులు. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. ఓటీటీలోకి సూపర్‌స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2'.. ఆ ప్రత్యేకతతో డిజిటల్ స్ట్రీమింగ్‌కు రంగం సిద్ధం! ఐదుమండలాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి, ఎమ్మెల్యే ఎమ్మెల్యే అమిలినేని. నా జీవితంలో ఎదురైన ఆ చేదు అనుభవం అదే.. ప్రముఖ సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు! అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా చేస్తాం త్వరలో ఓటీటీ వేదికగా అలరించనున్న జ్యోతిరాయ్ 'కిల్లర్' సినిమా.. పూర్తి వివరాలు ఇవే! వదలని మురసు.. చెరువులను తలపిస్తున్న రహదారులు. వేంసూరు రైతులకు సాగు నీటి వరం పోలింగ్కు సర్వం సిద్ధం పనబాక లక్ష్మి దంపతుల ఆశీస్సులు స్వీకరించిన కార్పొరేటర్ నాగభూషణం స్థానిక ఎన్నికలకు అంతా రెడీ శాసనమండలి మాజీ ఛైర్మన్ డాక్టర్ చక్రపాణి మృతి:

పైతర గ్రామంలో కేత్ బచావో అభియాన్ కార్యక్రమం

Select Suryaa Now
పైతర గ్రామంలో కేత్ బచావో అభియాన్ కార్యక్రమం

కొల్చారం;మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని పైతర గ్రామంలో బుధవారం కేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భూ సుపోషణ, భూ సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు తక్కువ నీటితో సాగు చేసుకునే ఆరు తడి పంటలైన జొన్న, మొక్కజొన్న, కుసుమ, పొద్దుతిరుగుడు, అపరాలు తదితర పంటలను సాగు చేయాలని సూచించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి భూసారాన్ని కాపాడుకోవాలని తెలిపారు.సమగ్ర పోషక యాజమాన్య పద్ధతుల్లో భాగంగా పచ్చిరొట్ట ఎరువులు, జీవ ఎరువులు, సూక్ష్మ పోషకాలను వినియోగిస్తూ నేల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని వివరించారు. అలాగే మట్టి నమూనాల సేకరణ, భూసార పరీక్షల విధానం, వాటి ప్రయోజనాలను రైతులకు తెలియజేశారు. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా పంటలకు అవసరమైన పోషకాలను అందించి, సమతుల్య ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్వేత, తునికి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి, గ్రామ ఉపసర్పంచ్ ఆరట్ల సుధాకర్, వ్యవసాయ విస్తరణ అధికారి అమృత్, గ్రామ ప్రజాప్రతినిధులు, రైతు సోదరులు పాల్గొన్నారు.