BREAKING
పీయులో ఇంటిగ్రేటెడ్ ఓరియంటేషన్ కార్యక్రమం ఎస్‌ఏఎఫ్ ఎఫ్ ఛాంపియన్‌షిప్: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన భారత్ న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం: విరాట్ కోహ్లీ అదరహో అనంతగిరిలో 65% ఓటింగ్ ఎనర్జీ డ్రింక్స్ అలసటను పోగొట్టే అమృతమా లేక అనారోగ్యాల నిలయమా: ఆరోగ్య నిపుణుల హెచ్చరికలు మాడుగులలో ప్రశాంతంగా ముగిసిన ప్రాదేశిక ఎన్నికల పోలింగ్: 72 శాతం నమోదు వాయు కాలుష్యం బారి నుంచి ఊపిరితిత్తులను రక్షించే అద్భుతమైన ఆహారాలు ఇవే చెదురు మదురు ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతం మాకవరపాలెంలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ. ఉదయం పూట ఓట్స్ తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా? ఆరోగ్య నిపుణుల సలహాలు పుస్తక పఠనంతో విజ్ఞానం మీ సొంతం కొత్తూరు మండలంలో నాలుగు చోట్ల ఘర్షణలు. ఫారంపాండ్ పనుల పరిశీలన జలుమూరులో 66.51 శాతం ప్రశాంతంగా ముగిసిన పలాస ఎన్నికలు - 66.96 శాతం పోలింగ్.

ఎస్వీయూలో ‘అన్వేషణ-2026’ ప్రారంభం -జ్ఞానానికి ఆవిష్కరణ జోడిస్తేనే భవిష్యత్ : రెక్టర్ ఆచార్య చెండ్రాయుడు

Select Suryaa Now
ఎస్వీయూలో ‘అన్వేషణ-2026’ ప్రారంభం  -జ్ఞానానికి ఆవిష్కరణ జోడిస్తేనే భవిష్యత్ : రెక్టర్ ఆచార్య చెండ్రాయుడు

ఎడ్యుకేషనల్ స్టాఫ్ రిపోర్టర్ : విద్యార్థుల్లో దాగి ఉన్న పరిశోధనా స్ఫూర్తిని, సృజనాత్మక ఆలోచనలను వెలికితీసేందుకు ఎస్వియూ వేదికగా నిలిచింది. ఎస్వీయూ డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ వెల్ఫేర్, కల్చరల్ అఫైర్స్ ఆధ్వర్యంలో రెండు రోజులు పాటు జరిగే అన్వేషణ-2026 సెనేట్ హాలులో ఘనంగా ప్రారంభమైంది. బుధవారం ప్రారంభమైన ఈ కార్యక్రమానికి రెక్టర్ ఆచార్య చెండ్రాయుడు ముఖ్యఅతిథిగా హాజరై రిజిస్టర్ భూపతి నాయుడుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెక్టర్ ఆచార్య చెండ్రాయుడు మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా తమ జ్ఞానానికి సృజనాత్మకతను జోడించి నూతన ఆవిష్కరణలు చేయాలని పిలుపునిచ్చారు. అలాంటి ఆవిష్కరణలకు అన్వేషణ లాంటి వేదిక ఎంతో ఉత్తమమైనదని పేర్కొన్నారు. రిజిస్టర్ ఆచార్య భూపతి నాయుడు మాట్లాడుతూ ఈ వేదిక ద్వారా విద్యార్థులు తమ దైనందిన జీవితంలో ఎదురయ్యే నిత్య సమస్యలకు వినూత్న పరిష్కారాలను చూపాలన్నారు. పరిశోధన సమాజానికి ఉపయోగపడాలని పిలుపునిచ్చారు. ఆచార్య నరసింహ మాట్లాడుతూ సాధారణ విద్యార్థులు కూడా పరిశోధనల పట్ల మక్కువ చూపేందుకు అన్వేషణ వేదిక ఎంతో ఉపయుక్తమైనదని, ఇది భవిష్యత్ శాస్త్రవేత్తలను తయారు చేస్తుందన్నారు. ఆచార్య సుధారాణి, ఆచార్య భువనేశ్వరి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు వ్యవసాయ అనుబంధ రంగం, ప్రాథమిక సైన్సు, ఇంజనీరింగ్ & టెక్నాలజీ, ఆరోగ్య శాస్త్రాము, సామాజిక శాస్త్రాలు, మానవీయ శాస్త్రాలు, వాణిజ్యం, వ్యాపార నిర్వహణ, చట్టం, ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ అనే ఏడు అంశాలలో సృజనాత్మకత, పరిపూర్ణత, స్పష్టత కూడిన ప్రాజెక్టులలో విజేతలను ప్రకటించనున్నారు. డైరెక్టర్ ఆచార్య మురళీధర్, కోఆర్డినేటర్స్ డాక్టర్ పత్తిపాటి వివేక్, డా కళ్యాణ్, శరత్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్