BREAKING
పీయులో ఇంటిగ్రేటెడ్ ఓరియంటేషన్ కార్యక్రమం ఎస్‌ఏఎఫ్ ఎఫ్ ఛాంపియన్‌షిప్: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన భారత్ న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం: విరాట్ కోహ్లీ అదరహో అనంతగిరిలో 65% ఓటింగ్ ఎనర్జీ డ్రింక్స్ అలసటను పోగొట్టే అమృతమా లేక అనారోగ్యాల నిలయమా: ఆరోగ్య నిపుణుల హెచ్చరికలు మాడుగులలో ప్రశాంతంగా ముగిసిన ప్రాదేశిక ఎన్నికల పోలింగ్: 72 శాతం నమోదు వాయు కాలుష్యం బారి నుంచి ఊపిరితిత్తులను రక్షించే అద్భుతమైన ఆహారాలు ఇవే చెదురు మదురు ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతం మాకవరపాలెంలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ. ఉదయం పూట ఓట్స్ తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా? ఆరోగ్య నిపుణుల సలహాలు పుస్తక పఠనంతో విజ్ఞానం మీ సొంతం కొత్తూరు మండలంలో నాలుగు చోట్ల ఘర్షణలు. ఫారంపాండ్ పనుల పరిశీలన జలుమూరులో 66.51 శాతం ప్రశాంతంగా ముగిసిన పలాస ఎన్నికలు - 66.96 శాతం పోలింగ్.

*అభివృద్ధిని చూసి ఓర్వలేకే మంత్రిపై అసత్య ఆరోపణలు*

Select Suryaa Now
*అభివృద్ధిని చూసి ఓర్వలేకే మంత్రిపై అసత్య ఆరోపణలు*

అల్లాదుర్గం;అందోల్ నియోజక వర్గంలో రూ.2 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నా యని అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పై విమర్శలు చేస్తున్నారని షేక్ జలీల్ మండిపడ్డారు. బుధవారం నియోజకవర్గం లో ఆయన మాట్లాడుతూ... ఢిల్లీ శాంగ్రిలా హోటల్లో రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మధ్య వాగ్వాదం జరిగిందంటూ మీడి యాలో వస్తున్న కథనాలలో నిజం లేదన్నారు. అందోల్ నియోజకవర్గంలో రూ.2 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, వాటిపై చర్చించకుండా నిరాధార ఆరోపణలకు ప్రాధాన్యం ఇవ్వడం సరికాదన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ సహనం, ఓర్పు, క్రమశిక్షణ కలిగిన నాయకుడని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే లక్షణాలను పార్టీ నాయకులకు నేర్పించారని గుర్తు చేశారు.రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం కల్పించిన నాయకుడి గౌరవాన్ని మరిచి మాట్లాడటం తగదని హితవు పలికారు. బీఫాం ఇచ్చి రాజకీయాల్లో నిలబెట్టిన నాయకుడి పట్ల కృతజ్ఞతతో ఉండాలని సూచించారు. నాయకుడి గొప్పతనంతో బీఫాం లభిస్తుందని, ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధిస్తారని, ఎదిగాక కృతజ్ఞత మరిచిపోవడం రాజకీయ అహంకారానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. మంత్రి దామోదర రాజనర్సింహ నాయకత్వాన్ని విమర్శలతో తగ్గించలేరని, ఆయన అభిమానుల ఆత్మగౌరవాన్ని తక్కువ అంచనా వేయవద్దని షేక్ జలీల్ హెచ్చరించారు.