BREAKING
ఆకుకూరలు వారానికి ఎన్నిసార్లు తినాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే! వర్షం సాక్షిగా ఎన్నికల ఏర్పాట్లు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – ఎన్నికల అధికారి వర్షం సాక్షిగా ఎన్నికల ఏర్పాట్లు. జోరువానలోనూ అధికారుల కసరత్తు - ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – ఎన్నికల అధికారి కాషాయ తీర్థం పుచ్చుకున్న వైసిపి నాయకులు. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. ఓటీటీలోకి సూపర్‌స్టార్ రజనీకాంత్ 'జైలర్ 2'.. ఆ ప్రత్యేకతతో డిజిటల్ స్ట్రీమింగ్‌కు రంగం సిద్ధం! ఐదుమండలాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి, ఎమ్మెల్యే ఎమ్మెల్యే అమిలినేని. నా జీవితంలో ఎదురైన ఆ చేదు అనుభవం అదే.. ప్రముఖ సింగర్ చిన్మయి సంచలన వ్యాఖ్యలు! అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా చేస్తాం త్వరలో ఓటీటీ వేదికగా అలరించనున్న జ్యోతిరాయ్ 'కిల్లర్' సినిమా.. పూర్తి వివరాలు ఇవే! వదలని మురసు.. చెరువులను తలపిస్తున్న రహదారులు. వేంసూరు రైతులకు సాగు నీటి వరం పోలింగ్కు సర్వం సిద్ధం పనబాక లక్ష్మి దంపతుల ఆశీస్సులు స్వీకరించిన కార్పొరేటర్ నాగభూషణం స్థానిక ఎన్నికలకు అంతా రెడీ శాసనమండలి మాజీ ఛైర్మన్ డాక్టర్ చక్రపాణి మృతి:

ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలి

Select Suryaa Now
ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలి

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : శ్రీపద్మావతి మహిళా డిగ్రీ పీజీ కళాశాలలో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థినికి హాస్టల్ వసతి కల్పించాలని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.ఇతర ప్రాంతాల నుంచి చదువుకోవడానికి వచ్చే పేద, గ్రామీణ విద్యార్థినులు ప్రైవేట్ హాస్టళ్లలో అధిక ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నారని, వారందరికీ హాస్టల్ వసతి కల్పించాలని బుధవారం ప్రిన్సిపాల్ భీమన్నకు వినతిపత్రం అందజేశారు. పద్మావతి అమ్మవారి పేరుతో కొనసాగుతున్న విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు అత్యుత్త ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. హాస్టల్ సీట్లు సరిపోకపోతే అదనపు వసతి సౌకర్యాలు కల్పనకు సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే హాస్టల్‌లో సీసీటీవీ కెమెరాలు, మహిళా వార్డెన్లు, తగిన భద్రతా సిబ్బంది, నాణ్యమైన ఆహారం, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలో కల్పించిన సమానత్వం వ్యక్తిగత గౌరవం వంటి విలువలకు అనుగుణంగా విద్యార్థినిలు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కళాశాలలో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థినికి హాస్టల్ వసతి కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని టిటిడిని కోరారు. ప్రిన్సిపాల్ కు వినతి ఇచ్చిన వారిలో వాల్మీకి విద్యార్థి సంఘం అధ్యక్షురాలు వినుత, భారతీయ దళిత విద్యార్థి సేన వ్యవస్థాపక అధ్యక్షులు కొండ యుగంధర్, బిజెఆర్ఎస్ఎఫ్ అర్జున్, బిఎస్ఎఫ్ కృష్ణ, శివకుమార్, నాగార్జున, మహేష్ వినతి ఇచ్చిన వారిలో ఉన్నారు. 

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్