BREAKING
పీయులో ఇంటిగ్రేటెడ్ ఓరియంటేషన్ కార్యక్రమం ఎస్‌ఏఎఫ్ ఎఫ్ ఛాంపియన్‌షిప్: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించిన భారత్ న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం: విరాట్ కోహ్లీ అదరహో అనంతగిరిలో 65% ఓటింగ్ ఎనర్జీ డ్రింక్స్ అలసటను పోగొట్టే అమృతమా లేక అనారోగ్యాల నిలయమా: ఆరోగ్య నిపుణుల హెచ్చరికలు మాడుగులలో ప్రశాంతంగా ముగిసిన ప్రాదేశిక ఎన్నికల పోలింగ్: 72 శాతం నమోదు వాయు కాలుష్యం బారి నుంచి ఊపిరితిత్తులను రక్షించే అద్భుతమైన ఆహారాలు ఇవే చెదురు మదురు ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతం మాకవరపాలెంలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ. ఉదయం పూట ఓట్స్ తింటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసా? ఆరోగ్య నిపుణుల సలహాలు పుస్తక పఠనంతో విజ్ఞానం మీ సొంతం కొత్తూరు మండలంలో నాలుగు చోట్ల ఘర్షణలు. ఫారంపాండ్ పనుల పరిశీలన జలుమూరులో 66.51 శాతం ప్రశాంతంగా ముగిసిన పలాస ఎన్నికలు - 66.96 శాతం పోలింగ్.

జడ్పిటిసి ఎన్నికలకు సర్వం సిద్ధం.. 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.. 10782 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న ఓటర్లు

Select Suryaa Now
జడ్పిటిసి ఎన్నికలకు సర్వం సిద్ధం.. 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.. 10782 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న ఓటర్లు

పులివెందుల, మేజర్ న్యూస్:

పులివెందుల మండలంలో గురువారం జరగనున్న జడ్పీటీసీ ఎన్నికలకు ఎన్నికల అధికారులు సర్వం సిద్ధం చేశారు. మండల పరిధిలో మొత్తం 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
మండల పరిధిలోని అచ్చ వెళ్లి 2, రాగి మానిపల్లె 1, ఎర్రబల్లెలో 1, కన్నంపల్లిలో 2, మోట్నూతలపల్లె 1, కొత్తపల్లెలో 2, ఎర్రబెల్లిలో 2, నల్లపురెడ్డిపల్లెలో 3, నల్గొండవారిపల్లెలో 1 పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 10,782 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 5,170 మంది పురుషులు, 5,612 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఓటరూ స్వచ్ఛందంగా పోలింగ్‌లో పాల్గొని తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు విజ్ఞప్తి చేశారు.

పి కృష్ణ. పులివెందుల స్టాప్ రిపోర్టర్ కడప జిల్లా