ఎంపీడీవో కు, వినతి పత్రం అందజేత
వట్టిపల్ల;మండల కేంద్రం ,మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మరియు వివిధ గ్రామాల మాజీ సర్పంచ్ లు అందరు కలసి ఎంపీడీవోకు వినతి పత్రం అందజేసినారు. మాజీ సర్పంచ్ లు వివిధ అభివృద్ధి పనులు చేసినట్లు, పెండింగ్ బిల్లులు రావాల్సి ఉన్నదని ,ఆ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో ఎంపీడీవో వెంకటేశ్వర్ రెడ్డికి వినతి పత్రం అందజేసినారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తో పాటు బి ఆర్ఎస్ నాయకులు ఎం వీరారెడ్డి ,వివిధ గ్రామాల మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్ లు పాల్గొన్నారు.