సంక్షేమం అభివృద్ధి ఇవే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
సంక్షేమం - అభివృద్ధి,ఇవే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
కూటమి జడ్పిటిసి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.
కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగు లు.
ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్న ప్రజా నాయకుడు చంద్రబాబు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.
సూర్య న్యూస్ దర్శి.
ప్రజల ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కూటమి పార్టీల బలపరిచిన అభ్యర్ధులని అఖండ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు. దర్శి జడ్పిటిసి జనసేన అభ్యర్థి వరి కూటి లక్ష్మీ తయారు, ముండ్లమూరు జడ్పిటిసి టిడిపి అభ్యర్థి మందలపు సౌమ్య, దొనకొండ జడ్పిటిసిటిడిపి అభ్యర్థి మోడీ ఈశ్వరమ్మ, కురిచేడు టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి బొరుగుల ఆవులమ్మ, తాళ్లూరు జడ్పిటిసి టీడీపీ అభ్యర్థి కైపు నాగలక్ష్మి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని డాక్టర్ లక్ష్మీ కోరారు.
అమూల్యమైన ఓటును సైకిల్, గాజు గ్లాస్ గుర్తుపై వేసి ఆశీర్వదించి గెలిపించాలని ఆమె కోరారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాన్ని అమలు చేసి మాట నిలబెట్టుకున్న నాయకుడు ప్రజా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని డాక్టర్ లక్ష్మి అన్నారు.