BREAKING
బేతుపల్లి చెరువులో ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందికి గల్లంతు కేవలం హీరోలే కాదు, మేమూ బ్లాక్‌బస్టర్‌ హిట్లు కొట్టగలం: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు! ఊపిరితిత్తులు బలహీనపడుతున్నాయని తెలిపే ముందస్తు సంకేతాలు ఇవే.. అప్రమత్తం కాకపోతే ముప్పే! భారతీయ చలనచిత్ర విప్లవకారుడు.. లెజెండరీ దర్శకుడు ఋత్విక్ ఘటక్ ప్రత్యేకతలు! *జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న సర్పంచి కల్లూరి అనిత యోగి నేపథ్యంలో ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ 'కందన్'.. దర్శకుడు జిబిన్ ఆంటోని ఆసక్తికర విశేషాలు! మలయాళ చిత్రసీమలో నాలుగు దశాబ్దాల ప్రయాణం.. ప్రముఖ మేకప్ లెజెండ్ పట్టణం రషీద్ ఆసక్తికర విశేషాలు! ఎన్నికలు కు సర్వం సిద్ధం 77 పోలింగ్ కేంద్రాలకు మునగాకు మరియు మునక్కాయల్లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. పోషకాల ఖజానా! అల్లు అరవింద్‌తో సినిమాపై నటి జయసుధ సరదా వ్యాఖ్యలు.. ఆసక్తికర టైటిల్ వెల్లడి! మొలకెత్తిన గింజలు రోజూ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే! పనబాక లక్ష్మీ ని కలిసిన కార్పొరేటర్ బట్టే వెంకట కీర్తి సరికొత్త గెటప్‌లో ఆకట్టుకుంటున్న శ్రీలీల.. ధనుష్ 'ఓమ్' చిత్రం నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్! రావులపాలెంలో కుండపోత వర్షం.. జలమయమైన ప్రధాన రహదారులు కూటమి విజయంలో బీసీల భాగస్వామ్యం భేష్ : మదనపల్లి చైర్మన్ శ్రీరామ్ చినబాబుకు శుభాకాంక్షలు : బీసీహెచ్పిఎస్ అధ్యక్షులు బోడెం రాజశేఖర్ వెల్లడి

ఎమ్మెల్యే ని కలిసిన 31 డివిజన్ కార్పొరేటర్ భానుప్రియ క్రికెట్ విజయ్ కి కార్పొరేటర్ పదవి అంకితం...

Select Suryaa Now
ఎమ్మెల్యే ని కలిసిన 31 డివిజన్ కార్పొరేటర్ భానుప్రియ  క్రికెట్ విజయ్ కి కార్పొరేటర్ పదవి అంకితం...

తిరుపతి, మేజర్ న్యూస్ :
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలలో 31 వ డివిజన్ కార్పొరేటర్ గా గెలుపొందిన మందపాటి భానుప్రియ, జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సతీష్ యాదవ్ దంపతులు బుధవారం ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్మెల్యే ని శాలువతో సత్కరించారు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించేలా దృష్టి సారించాలని కార్పొరేటర్ భానుప్రియ దంపతులకు ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ఎమ్మెల్యే తనయుడు అరణి జగన్ ను కూడా కలిశారు.
అనంతరం మీడియాతో  కార్పొరేటర్ మందపాటి భానుప్రియ, ఆమె భర్త సతీష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ తాము గెలుపొందడానికి సహకరించిన 31వ డివిజన్ ఓటరు మహాశయులందరికీ  రుణపడి ఉంటామని చెప్పారు. డివిజన్లోని ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆపద వచ్చిన పరిష్కరించేందుకు ఎప్పుడు, ఎల్లప్పుడూ ముందుంటామని పేర్కొన్నారు. ప్రచార సమయంలో 31 డివిజన్లోని పలు వీధులలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని వాటిని పరిష్కరించే దిశగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరింప చేస్తామని హామీ ఇచ్చారు. తమ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
క్రికెట్ విజయ్ కి కార్పొరేటర్ పదవి అంకితం...
తన సతీమణి మందపాటి భానుప్రియ కు జనసేన పార్టీ తరఫున కార్పొరేటర్ టికెట్ ఇప్పించి విజయం చేకూరడంలో కీలకంగా వ్యవహరించిన క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర నేత క్రికెట్ విజయ్ కుమార్ కు తాము గెలుపొందిన కార్పొరేటర్ పదవిని అంకితం చేస్తున్నామని కార్పొరేటర్ భానుప్రియ, జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సతీష్ యాదవ్ తెలిపారు. రాజకీయాలలో తాము కొత్త అయినప్పటికీ మమ్మల్ని గుర్తించి జనసేన పార్టీలో సభ్యత్వం ఇప్పించిన క్రికెట్ విజయ్ అన్నకు జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఈరోజు కార్పొరేటర్ గా వేలాది మంది ప్రజల ఆశీస్సులతో గెలుపొందామంటే అందుకు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ఆశీస్సులతోపాటు క్రికెట్ విజయ్ సహకారం, తోడ్పాటు మరువలేనిదని, వారికి ఎప్పుడు కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ రుణపడి ఉంటామని వారు తెలిపారు. 

H. Dwaraka, staff reporter 

9705347341.