జనసేన కౌన్సిలర్లకు ఎంపీ చింతకాయల విజయ్ ఘన సత్కారం
- ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపు
నర్సీపట్నం నవంబర్ 4 మేజర్ న్యూస్ :
నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్లుగా గెలుపొందిన కూటమి (జనసేన) నాయకులు పంచాడ హరినాథ్, రామకృష్ణలను రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ ఘనంగా సత్కరించారు. నూతనంగా ఎన్నికైన వీరిద్దరినీ ఆయన గజమాలతో సత్కరించి, ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా ఎంపీ విజయ్ మాట్లాడుతూ.. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా వార్డుల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సూర్యచంద్ర, తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.