ఎంపీటీసీ పోలింగ్ కు సర్వం సిద్ధం - నేడే పలాస మండలంలో ఓటింగ్.
11 ఎంపీటీసీ స్థానాలకు 47 కేంద్రాల్లో పోలింగ్ - పక్కా బందోబస్తు.
పలాస, నవంబర్ 4, మేజర్ న్యూస్.
పలాస మండలంలో 11 ఎంపీటీసీ ప్రాదేశికాలకు గురువారం నిర్వహించనున్న పోలింగ్ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో పోలింగ్ సంబంధిత పోలింగ్ సామగ్రిని పంపిణీ చేశారు.మండలంలో 47 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 47 పీవోలు, 47 ఏపీవోలు, 188 ఓపీవోలను నియమించారు. అదనంగా మరో 10 మందిని ఓట్లు ఎక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో నియమించారు.ఐదు రూట్లలో 7 బస్సులు, టాటా మ్యాజిక్ లు, రెండు కార్లు, జోనల్ అధికారులకు 5 కార్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులకు మౌలిక సదుపాయాలు కల్పించామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మెట్ట రవికృష్ణ తెలిపారు.