ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి మార్గదర్శకాలు.
- అనకాపల్లి పోలీస్ శాఖ.
అనకాపల్లి, నవంబర్ 4, మేజర్ న్యూస్: నేడు జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు అనకాపల్లిలోని రావుగోపాలరావు కళాక్షేత్రంలో పోలీస్ అధికారులకు, సిబ్బందికి సమగ్ర అవగాహన దిశానిర్దేశం సదస్సును బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఈ.శ్రీనివాసులు, అనకాపల్లి టౌన్ సీఐ ప్రేమ్ కుమార్, రూరల్ సీఐ అశోక్ కుమార్, ఎస్ఐ రవికుమార్ పాల్గొని సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. నియోజకవర్గ పరిధిలోని మొత్తం 15 రూట్లకు కేటాయించిన అధికారులు, సిబ్బందితో రూట్ల వారీగా సమీక్ష నిర్వహించి ఎన్నికల విధులకు సంబంధించిన విధివిధానాలను వివరించారు. 15 రూట్లలో బందోబస్తు విధులు నిర్వహించే ప్రతి అధికారి, సిబ్బంది తమ పరిధిలోని ప్రాంతాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి మాత్రమే బాధ్యతలు నిర్వర్తించాలి, విధుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం ప్రదర్శించరాదు. ఓటర్లతో, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూనే, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రలోభాలు జరగకుండా కఠిన నిఘా ఉంచాలి. అత్యవసర సమయాల్లో పైఅధికారులతో సమన్వయం చేసుకునే విధానాన్ని విశదీకరించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి విజయవంతం చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో 15 రూట్ల బాధ్యత కలిగిన పోలీస్ సిబ్బంది, ఇతర అధికారులు