BREAKING
ఎన్టీఆర్‌లో పోలింగ్ ప్రశాంతం.. 992 కేంద్రాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి ఎన్నికల సామగ్రి స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి లీజులు, లైసెన్సుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు 15 రోజుల్లో 2.29 కోట్ల వీక్షణలు.. - సామాజిక మాధ్యమాల్లో మార్మోగిన కనకదుర్గమ్మ దసరా వైభవం కార్తీక మాసం, భవానీ దీక్షల ఏర్పాట్లపై సమీక్ష అన్నప్రసాదం తయారీ, పంపిణీ వ్యవస్థ ఆధునీకరణకు చర్యలు ఎపిఇఆర్సీ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం.. అనంతరం అమ్మవారి దర్శనం గో సంరక్షణ పథకానికి రూ.2 లక్షల విరాళం అన్నదానం ట్రస్ట్‌కు రూ.1,00,116 విరాళం శోభన్ బాబు ఆప్యాయత, ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణంపై జయప్రద ఆసక్తికర వ్యాఖ్యలు: సినీ, రాజకీయ విశేషాలు స్నాక్స్‌గా మఖానా తింటే శరీరానికి ఎలాంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా? నిపుణుల సలహాలు హైదరాబాద్‌లో ఎల్ నినో సన్నద్ధత ముమ్మరం - జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్. వి. కర్ణన్, హైడ్రా కమిషనర్ ఏ. వి. రంగనాథ్ వెల్లడి కోలీవుడ్‌లో సంచలన ఎంట్రీ ఇవ్వనున్న టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌: తమిళ చిత్రంలో విలన్‌గా అరంగేట్రం ఉదయాన్నే నానబెట్టిన నల్ల కిస్‌మిస్ తింటే శరీరంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు వస్తాయో తెలుసా? ఆరోగ్య నిపుణుల సలహాలు ఉపాధ్యాయులకు మాక్ టెస్ట్ ప్రాక్టీసుకు అవకాశం

పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల పరిశీలకుడి ప్రత్యేక దృష్టి

Select Suryaa Now
పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల పరిశీలకుడి ప్రత్యేక దృష్టి

 

మాకవరపాలెం, నవంబర్ 4,మేజర్ న్యూస్:

మాకవరపాలెం మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను జిల్లా ఎన్నికల పరిశీలకుడు రోణంకి గోపాలకృష్ణ బుధవారం పరిశీలించారు. మండలంలోని హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ (డిస్ట్రిబ్యూషన్) కేంద్రాన్ని సందర్శించి అక్కడి ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర పోలింగ్ సామగ్రి పంపిణీ చేసే విధానాన్ని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు అవసరమైన సామగ్రిని తరలించేందుకు చేపట్టిన ఏర్పాట్లు, సిబ్బందికి కల్పిస్తున్న సౌకర్యాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకుడు మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సామగ్రి పంపిణీ నుంచి పోలింగ్ ముగిసే వరకు ప్రతి అంశంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.