BREAKING
నర్సీపట్నంలో నూతన శకం.. చారిత్రాత్మక మెజారిటీతో మున్సిపల్ పీఠం కైవసం. వర్షము కురుస్తున్న ఆగని ఎలక్షన్ సామాగ్రి తరలింపు నెపోటిజంపై కరీనా కపూర్ సంచలన వ్యాఖ్యలు.. కరణ్ జోహార్ రియాక్షన్ చూశారా! పంట కాలవలు ధ్వంసం ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి మార్గదర్శకాలు. ఎమ్మెల్యే ని కలిసిన 31 డివిజన్ కార్పొరేటర్ భానుప్రియ క్రికెట్ విజయ్ కి కార్పొరేటర్ పదవి అంకితం... పోలింగ్ ఏర్పాట్లపై ఎన్నికల పరిశీలకుడి ప్రత్యేక దృష్టి వైసీపీకి మరో షాక్.. టీడీపీలోకి ముషిడిపాలెం ,చినరాచపల్లి నాయకులు రామాయణంపై ప్రముఖ సింగర్ బాద్షా ప్రశంసల వర్షం.. జటాయు సీన్ కంటతడి పెట్టించిందంటూ రివ్యూ! కుంటిభద్ర పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ యస్ పి. ఎంపీటీసీ పోలింగ్ కు సర్వం సిద్ధం - నేడే పలాస మండలంలో ఓటింగ్. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట భద్రతా చర్యలు జాయ్ స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం డబ్ల్యూబీబీఎల్‌లో ఊహించని నాటకీయత.. చివరి బంతికి వికెట్ కీపర్ చేసిన తప్పిదంతో ఓడిపోయిన హరికేన్స్! ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలి ఇంకొల్లు ఎస్ఐ వినోద్ కుమార్

ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనం ఎస్సై బాలరాజు

Select Suryaa Now
ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనం ఎస్సై బాలరాజు

రామాయంపేట;పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటే భయపడే పరిస్థితిని మార్చి, ప్రజలు తమకు ఎదురయ్యే చిన్నచిన్న సమస్యలను సైతం ధైర్యంగా పోలీసుల దృష్టికి తీసుకెళ్లేలా స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించిన అధికారి ఎస్సై బాలరాజు అని రామాయంపేట ప్రెస్ క్లబ్ (టి యు డబ్ల్యూ జే) అధ్యక్షుడు బసన్నపల్లి మల్లేశం అన్నారు. రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా 27 నెలల పాటు విధులు నిర్వహించిన బాలరాజు తనదైన పని తీరుతో ప్రజలకు చేరువయ్యారని పేర్కొన్నారు. అధికారులకు బదిలీలు సాధారణమే అయిన, ఇలాంటి అధికారి బదిలీపై బాధాకరమని అన్నారు.గతంలో ఏదైనా సమస్య ఎదురైతే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలా? పోలీసులకు చెబితే ఎలా స్పందిస్తారో? అనే సందేహాలు, భయాలు కొంతమందిలో ఉండేవని మల్లేశం అన్నారు. అయితే ఎస్సై బాలరాజు రామాయంపేటలో బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చెప్పుకునే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. చిన్న సమస్య అయినా నిర్లక్ష్యం చేయకుండా పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడం ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనమని కొనియాడారు.పోలీసులు అంటే కేవలం నేరాలను అరికట్టడం, కేసులు నమోదు చేయడం మాత్రమే కాకుండా ప్రజలకు భరోసా కల్పించడం, బాధితులకు అండగా నిలవడం, సమస్యలను శాంతియుతంగా పరిష్కరించే దిశగా కృషి చేయడం కూడా ముఖ్యమని పేర్కొన్నారు. ఈ విషయంలో బాలరాజు ప్రజలతో మమేకమవుతూ, అందరితో స్నేహపూర్వకంగా వ్యవహరించారని అన్నారు.ప్రజలు పోలీస్ స్టేషన్‌ను తమ సమస్యలు చెప్పుకునే వేదికగా భావించేలా చేయడం, పోలీసుల పట్ల ఉన్న భయాన్ని తగ్గించి నమ్మకాన్ని పెంపొందించడం అభినందనీయమన్నారు. 27 నెలల పాటు రామాయంపేటలో ఆయన అందించిన సేవలు ప్రజలకు గుర్తుండిపోతాయని, విధి నిర్వహణలో ఆయన చూపిన చొరవ, ప్రజలతో కొనసాగించిన సత్సంబంధాలు మరువలేనివని బసన్నపల్లి మల్లేశం పేర్కొన్నారు. ప్రజలకు పోలీస్ శాఖపై మరింత విశ్వాసం కలిగించేలా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని కొనసాగించడం అవసరమని, బాలరాజు వంటి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించడం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే జిల్లా ఉపాధ్యక్షుడు పాతూరి రమేష్ గౌడ్,  రామాయంపేట ప్రెస్ క్లబ్ (టి యు డబ్ల్యూ జే) ఉపాధ్యక్షులు తుజాల శ్రీనివాస గౌడ్, కర్రె నరేందర్, కోశాధికారి రంగా రాజకిషన్, సభ్యులు బల్ల యాదగిరి, తుడుం పెంటయ్య, సార్గు నర్సింలు తో పాటు పలువురు ఉన్నారు.