BREAKING
ఎన్టీఆర్‌లో పోలింగ్ ప్రశాంతం.. 992 కేంద్రాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి ఎన్నికల సామగ్రి స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి లీజులు, లైసెన్సుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు 15 రోజుల్లో 2.29 కోట్ల వీక్షణలు.. - సామాజిక మాధ్యమాల్లో మార్మోగిన కనకదుర్గమ్మ దసరా వైభవం కార్తీక మాసం, భవానీ దీక్షల ఏర్పాట్లపై సమీక్ష అన్నప్రసాదం తయారీ, పంపిణీ వ్యవస్థ ఆధునీకరణకు చర్యలు ఎపిఇఆర్సీ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం.. అనంతరం అమ్మవారి దర్శనం గో సంరక్షణ పథకానికి రూ.2 లక్షల విరాళం అన్నదానం ట్రస్ట్‌కు రూ.1,00,116 విరాళం శోభన్ బాబు ఆప్యాయత, ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణంపై జయప్రద ఆసక్తికర వ్యాఖ్యలు: సినీ, రాజకీయ విశేషాలు స్నాక్స్‌గా మఖానా తింటే శరీరానికి ఎలాంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా? నిపుణుల సలహాలు హైదరాబాద్‌లో ఎల్ నినో సన్నద్ధత ముమ్మరం - జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్. వి. కర్ణన్, హైడ్రా కమిషనర్ ఏ. వి. రంగనాథ్ వెల్లడి కోలీవుడ్‌లో సంచలన ఎంట్రీ ఇవ్వనున్న టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌: తమిళ చిత్రంలో విలన్‌గా అరంగేట్రం ఉదయాన్నే నానబెట్టిన నల్ల కిస్‌మిస్ తింటే శరీరంలో ఎలాంటి అద్భుతమైన మార్పులు వస్తాయో తెలుసా? ఆరోగ్య నిపుణుల సలహాలు ఉపాధ్యాయులకు మాక్ టెస్ట్ ప్రాక్టీసుకు అవకాశం

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలి ఇంకొల్లు ఎస్ఐ వినోద్ కుమార్

Select Suryaa Now
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలి ఇంకొల్లు ఎస్ఐ వినోద్ కుమార్


ఇంకొల్లు, మేజర్ న్యూస్: ఇంకొల్లు మండలంలో గురువారం జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించు కోవాలని ఇంకొల్లు ఎస్ఐ బి వినోద్ కుమార్ సూచించారు. ఇంకొల్లు మండలంలో మొత్తం ఐదు రూట్లు గా విభజించి బందోబస్తు పటిష్టం చేశామన్నారు. 70 మంది పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారన్నారు. ఐదు రూట్ మొబైల్స్, రెండు స్ట్రైకింగ్ ఫోర్స్ 1, స్పెషల్ ట్రైనింగ్ ఫోర్స్ బృందాలు బందోబస్తు నిర్వహిస్తున్నారన్నారు. ఇంకోలు మండలంలో గురువారం144 సెక్షన్, 30 యాక్ట్ అమల్లో ఉంటుందన్నారు. 100 మీటర్ల లోపు ఎవరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదన్నారు. వంకాయలపాడు నుండి భీమవరం వరకు మొత్తం 52 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్సై కోరారు.