అప్పుల బాధతో ఉపాధ్యాయుడి ఆత్మహత్య
కొండాపూర్;క్రెడిట్ కార్డుల అప్పుల బాధ భరించలేక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని న్యూ మల్కాపూర్ రాఘవేంద్ర నగర్ కాలనీలో నివాసముంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు మంగలి వీరేశం (33) బుధవారం ఉదయం 5:30 గంటలకు ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందినట్లు ఎస్ఐ సోమేశ్వరి తెలిపారు.క్రెడిట్ కార్డుల అప్పుల కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి తండ్రి మంగలి రామచందర్ ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సోమేశ్వరి వెల్లడించారు.