BREAKING
బేతుపల్లి చెరువులో ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందికి గల్లంతు కేవలం హీరోలే కాదు, మేమూ బ్లాక్‌బస్టర్‌ హిట్లు కొట్టగలం: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు! ఊపిరితిత్తులు బలహీనపడుతున్నాయని తెలిపే ముందస్తు సంకేతాలు ఇవే.. అప్రమత్తం కాకపోతే ముప్పే! భారతీయ చలనచిత్ర విప్లవకారుడు.. లెజెండరీ దర్శకుడు ఋత్విక్ ఘటక్ ప్రత్యేకతలు! *జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న సర్పంచి కల్లూరి అనిత యోగి నేపథ్యంలో ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ 'కందన్'.. దర్శకుడు జిబిన్ ఆంటోని ఆసక్తికర విశేషాలు! మలయాళ చిత్రసీమలో నాలుగు దశాబ్దాల ప్రయాణం.. ప్రముఖ మేకప్ లెజెండ్ పట్టణం రషీద్ ఆసక్తికర విశేషాలు! ఎన్నికలు కు సర్వం సిద్ధం 77 పోలింగ్ కేంద్రాలకు మునగాకు మరియు మునక్కాయల్లో దాగున్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. పోషకాల ఖజానా! అల్లు అరవింద్‌తో సినిమాపై నటి జయసుధ సరదా వ్యాఖ్యలు.. ఆసక్తికర టైటిల్ వెల్లడి! మొలకెత్తిన గింజలు రోజూ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే! పనబాక లక్ష్మీ ని కలిసిన కార్పొరేటర్ బట్టే వెంకట కీర్తి సరికొత్త గెటప్‌లో ఆకట్టుకుంటున్న శ్రీలీల.. ధనుష్ 'ఓమ్' చిత్రం నుంచి సాంగ్ ప్రోమో రిలీజ్! రావులపాలెంలో కుండపోత వర్షం.. జలమయమైన ప్రధాన రహదారులు కూటమి విజయంలో బీసీల భాగస్వామ్యం భేష్ : మదనపల్లి చైర్మన్ శ్రీరామ్ చినబాబుకు శుభాకాంక్షలు : బీసీహెచ్పిఎస్ అధ్యక్షులు బోడెం రాజశేఖర్ వెల్లడి

తిరుపతి రూరల్ లో ఓటర్లకు అందని స్లిప్పులు... స్లిప్పులు అందకపోవడంతో ఓటర్ల లో గందరగోళం... తగ్గనున్న ఓటింగ్ శాతం...

Select Suryaa Now
తిరుపతి రూరల్ లో ఓటర్లకు అందని స్లిప్పులు...   స్లిప్పులు అందకపోవడంతో ఓటర్ల లో గందరగోళం...  తగ్గనున్న ఓటింగ్ శాతం...

తిరుపతి రూరల్, మేజర్ న్యూస్ :
తిరుపతి రూరల్ మండలంలో ని 40 ఎం పి టి సి స్థానాలకు, జడ్పిటిసి స్థానానికి గురువారం ఎన్నికల పోలింగ్ జరగనుంది. అందుకు ఏర్పాట్లు అన్ని సిద్ధం చేసినట్లు రూరల్ మండలం ఎన్నికల రిటర్నింగ్ అధికారి యశ్వంత్ తెలిపారు. కానీ రూరల్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఓటర్లకు రాత్రి 10 గంటలైనా ఓటర్ స్లిప్పులు పంపిణీ జరగలేదు. అందుకు అధికారుల నిర్లక్ష్యం ఇట్టే కనిపిస్తోంది. పక్క హోటల్ స్లిప్పుల కోసం గ్రామపంచాయతీ ఆఫీసుల చుట్టూ ఓటర్లు పలుమార్లు తిరిగినప్పటికీ బిఎల్వోలు వచ్చి మీ ఇంటి దగ్గర స్లిప్పులను ఇస్తారని పంచాయతీ కార్యాలయాల్లో ఉన్న సిబ్బంది చెప్పి తప్పించుకుంటున్నారు. మరో కొద్ది గంటల్లోనే పోలింగ్ ప్రారంభం కానున్నప్పటికీ ఇంతవరకు స్లిప్పులు ఓటర్లకు చేరకపోవడంతో ఓటర్లలో అయోమయ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఓటర్ స్లిప్పుల కోసం పడిగాపులు...
ఓటర్లకు స్లిప్పులను ఆయా గ్రామపంచాయతీలలోని సచివాలయ ఉద్యోగులు బిఎల్వోలు ఓటర్ స్లిప్పులను పోలింగ్ కు ముందు రోజు లోపు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ తిరుపతి రూరల్ మండలంలోని 36 పంచాయతీలలో సగం పంచాయతీలలో కూడా ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయలేదని ఓటర్ల బహిరంగంగా బిఎల్ఓ లతో వాదనకు దిగారు. 
పోలింగ్ కేంద్రాల ఆచూకీ ఎక్కడ..?
తిరుపతి రూరల్ మండలంలోని 40 ఎంపీటీసీ స్థానాలు, ఒక జడ్పిటిసి స్థానానికి 1,50,000 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సింది. ఓటర్లకు అన్ని పంచాయతీలలో పూర్తిస్థాయిలో స్లిప్పులు పంపిణీ చేయకపోవడంతో ఓటింగ్ శాతం చాలా వరకు తగ్గే ప్రమాదం ఉందని మేధావి వర్గం అంటున్నారు.
స్లిప్పుల పంపిణీ నీ పరివేక్షించాల్సిన అధికారులు చేతులెత్తేయడంతో కిందిస్థాయి సిబ్బంది ఓటర్ స్లిప్పులను పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం ఒక వ్యవహరించడం సకాలంలో అందకపోవడంతో ఓటర్లలో ఓటింగ్ లో పాల్గొనాలన్న స్లిప్పు లేకపోవడంతో ఓటర్లలో అయోమయ పరిస్థితి నెలకొంది. 
ఓటర్ స్లిప్పులను పంపిణీ చేయకపోవడంతో ఎన్నికల ను పర్యవేక్షించే అధికారుల తీరుపై ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
ఓటింగ్ శాతం తగ్గే అవకాశం...
తిరుపతి రూరల్ మండలంలోని 1,52,000 పైగా ఓటర్లకు 100% స్లిప్పులను పంపిణీ చేయలేదు. దీంతో ఓటింగ్ లో పాల్గొనాలనుకునే మొదటిసారి ఓటు హక్కును పొందిన యువత తీవ్ర నిరాశకు లోనయ్యారు. మరోపక్క వృద్ధులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఓటు హక్కు పొందిన వారు స్లిప్పులు లేకపోవడంతో ఓటింగ్ కు పాల్గొనలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు . ఓటర్లు జడ్పిటిసి స్థానానికి ఒక ఓటు, ఎంపీటీసీ స్థానానికి ఒక ఓటు హక్కు ను వినియోగించుకోవాల్సింది.
మండలంలో 132 
సమస్యాత్మక కేంద్రాలు...
రూరల్ మండలంలో 169 కేంద్రాలలో 132 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీస్ బలగాలతో పాటు సీసీ కెమెరాలు నిఘాను ఏర్పాటు చేయనున్నారు. 
సీసీ కెమెరాల నిఘాలో ఎన్నికల పోలింగ్...
సీసీ కెమెరాల పరిరక్షణలో ఎన్నికల పోలింగ్ జరగనుంది
ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన అందుకు సంబంధిత పోలింగ్ కేంద్రం వద్దనున్న బందోబస్తు అధికారులతో పాటు పోలింగ్ కేంద్రం అధికారి సిబ్బంది బాధ్యతలు అవుతారని ఇప్పటికే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో పకడ్బందీగా సీసీ కెమెరాలు నిఘాలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు పోలీస్ బలగాలను నియమించారు.

H. Dwaraka, staff reporter 

9705347341