కుల బహిష్కరణ కేసులో సంచలన తీర్పు. ...ఐదుగురికి ఐదేళ్ల జైలు శిక్ష.
సూర్య నిజామాబాద్ క్రైమ్ :
కులo పేరుతో దూషించి, సామాజిక బహిష్కరణ చేసిన కేసులో నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం దూస్‌గాం గ్రామానికి చెందిన ఐదుగురు విడిసి సభ్యులకు ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. దోషులుగా తేలిన ప్రతి ఒక్కరికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 10,000 జరిమానా విధించినట్లు కోర్టు తెలిపింది.
నిజామాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గ్రామభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో పాలన సాగుతుంటుంది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం కులానికి ఒక పెద్దమనిషి చొప్పున ఎన్నుకొని విడిసిని ఏర్పాటు చేస్తారు. వీరు కాలపరిమితి చివరి రోజున గ్రామానికి లెక్కలు చెప్పి, కొత్త సభ్యులను ఎన్నుకుంటారు.
2021 ఆగస్టు 21న కొత్త సభ్యుల ఎన్నిక సందర్భంగా ఎప్పుడు మా మాదిగ కులానికి క్యాషియర్ పదవి ఇవ్వలేదు, ఈసారి మాకు కావాలి" అని మాదిగ కులానికి చెందిన వ్యక్తులు అడగడంతో వివాదం చెలరేగింది. దీనితో మూన్వార్ కాపు, రెడ్డి కులాలకు చెందిన వారు వీరిని కులం పేరుతో దూషించి, ఊరిలో డప్పులు కొట్టుకోవద్దని, గ్రామం కులాన్‌పూర్ వారిని తీసుకువచ్చి వీరి ఉపాధికి గండి కొట్టాలని శివారెడ్డి, గంగారెడ్డి, ఇందూర్ రాములు తదితరులు హెచ్చరించారు.
బాధితులు డిచ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ జరిపి విడిసి సభ్యులైన మంద లక్ష్మణ్, మంద జనార్ధన్, మంద మోహన్, మంద రాజ్యలక్ష్మి, శివారెడ్డి, గంగారెడ్డి, ఇందూర్ రాములుపై కేసు నమోదు చేసి కోర్టుకు సమర్పించారు.
ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాధారాలను పరిశీలించిన ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి నారాయణ బుధవారం ఈ తీర్పు వెల్లడించారు. నిందితులలో మంద జనార్ధన్ దుబాయ్ వెళ్లడంతో అతనిపై కేసును స్ప్లిట్ చేశారు. మరో నిందితుడైన ఇందూర్ రాములు విచారణ సమయంలోనే మరణించడంతో ఆయనపై ఉన్న కేసును మూసివేశారు. మిగతా నిందితులు తిరిగి వచ్చిన తర్వాత ఆ కేసుపై మళ్లీ విచారణ జరుగుతుందని న్యాయవర్గాలు తెలిపాయి. ప్రాసిక్యూషన్ తరఫున ఎస్సీ, ఎస్టీ కోర్టు పి.పి. దయాకర్‌గౌడ్ వాదనలు వినిపించారు.