BREAKING
అంసాన్ పల్లి గ్రామంలో పశువులకు నట్టల నివారణ మందుల పంపిణీ సైబర్ నేరాల నుంచి నిన్ను నీవు రక్షించుకోండి *అభివృద్ధిని చూసి ఓర్వలేకే మంత్రిపై అసత్య ఆరోపణలు* రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది ఎస్వీయూలో ‘అన్వేషణ-2026’ ప్రారంభం -జ్ఞానానికి ఆవిష్కరణ జోడిస్తేనే భవిష్యత్ : రెక్టర్ ఆచార్య చెండ్రాయుడు కొల్చారంలో ఆల్ ఇండియా బంజారా మేళా ప్రతి విద్యార్థికి హాస్టల్ వసతి కల్పించాలి రేణిగుంటలో ఓటర్ స్లిప్పుల బీఎల్వోలు ఇవ్వలేదని ఓటర్ల ఆగ్రహం.. పైతర గ్రామంలో కేత్ బచావో అభియాన్ కార్యక్రమం జడ్పిటిసి ఎన్నికలకు సర్వం సిద్ధం.. 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.. 10782 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్న ఓటర్లు పేట స్వర్ణకార సంఘం అధ్యక్షులుగా నరసింహ చారి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనం ఎస్సై బాలరాజు అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల సునామీ: సెనేట్, హౌస్ రెండూ వారివే సంక్షేమం అభివృద్ధి ఇవే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించాలి

ఎంపీటీసీ జెడ్పీటీసీ పోలింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి.

Select Suryaa Now
ఎంపీటీసీ జెడ్పీటీసీ పోలింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి.

కళ్యాణదుర్గం :-ఎంపీటీసీ ,జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించే అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు ప్రతి అంశంలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. పోలింగ్ సమయంలో జరిగే చిన్నపాటి పొరపాట్లు సైతం ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఏజెంట్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని పేర్కొంటున్నారు. ముఖ్యంగా బ్యాలెట్ పత్రాల పరిశీలన, ఓటింగ్ విధానం, ఏజెంట్ల గుర్తింపు, అధికారుల అనుమతి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. పోలింగ్ ప్రారంభానికి ముందే ప్రతి ఏజెంట్ సంబంధిత పోలింగ్ కేంద్రానికి చేరుకోవాలి. ఎన్నికల విధులకు అవసరమైన ఫారం XIIతో పాటు సంబంధిత గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించే సమయంలో ఎన్నికల సిబ్బందికి అవసరమైన పత్రాలను సమర్పించి, నిబంధనల ప్రకారం అనుమతి పొందాలి. అలాగే బ్యాలెట్ పత్రాల్లో తమ అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు సరిగ్గా ముద్రించబడ్డాయా లేదా అనే విషయాన్ని ఎన్నికల నిబంధనలకు లోబడి పరిశీలించాలి. బ్యాలెట్ పత్రాలను ఓటర్లకు అందించే విధానం, వాటిని మడిచే ప్రక్రియ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయా అనే అంశాలను గమనించాలి. పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సిబ్బంది అనుసరిస్తున్న విధానాలను నిశితంగా పరిశీలిస్తూ, ఏవైనా అనుమానాస్పద పరిణామాలు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ ఏదైనా కారణంతో పోలింగ్ ఏజెంట్‌ను కేంద్రంలోకి అనుమతించకపోతే ఆందోళనకు గురికాకుండా సంబంధిత ప్రిసైడింగ్ అధికారిని సంప్రదించాలి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఎన్నికల నియమాలు–2006లోని రూల్ 19(3), రూల్ 37(1)(c) నిబంధనలను ప్రస్తావిస్తూ తమ అభ్యంతరాన్ని అధికారికంగా తెలియజేయాలి. సమస్య పరిష్కారం కాకపోతే రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడంతో పాటు పార్టీ నాయకత్వానికి వెంటనే సమాచారం అందించాలి. పోలింగ్ సమయంలో ఏవైనా అవకతవకలు జరిగినట్లు గుర్తిస్తే వాటికి సంబంధించిన వివరాలను నమోదు చేసుకుని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. అవసరమైనప్పుడు లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందించి, దాని స్వీకరణకు సంబంధించిన ఆధారాన్ని భద్రపరుచుకోవాలి. అయితే పోలీసులతో వాగ్వాదానికి దిగడం, ఎన్నికల విధులకు ఆటంకం కలిగించడం, ఇతరులతో ఘర్షణకు దిగడం వంటి చర్యలకు దూరంగా ఉండాలి. ప్రతి సమస్యను ఎన్నికల అధికారుల ద్వారా చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలి. ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా సాగేందుకు పోలింగ్ ఏజెంట్ల బాధ్యత కీలకమని, కాబట్టి ఏజెంట్లు భావోద్వేగాలకు లోనుకాకుండా ఎన్నికల నియమాలపై అవగాహనతో వ్యవహరిస్తూ తమ అభ్యర్థుల తరఫున బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచిస్తున్నారు.
కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :- బోయరంగస్వామి.