BREAKING
ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనం ఎస్సై బాలరాజు అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల సునామీ: సెనేట్, హౌస్ రెండూ వారివే సంక్షేమం అభివృద్ధి ఇవే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ఇంటింటికీ ఇంకుడు గుంతలు నిర్మించాలి మార్గం మధ్యలో 108 లో మహిళ ప్రసవం. అభివృద్ధి సంక్షేమం ఇవే కూటమి ప్రధాన లక్ష్యం సొంతింటి కల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అమిత్ షాకు జగ్గారెడ్డి కౌంటర్.. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే మా లక్ష్యం! అప్పుల బాధతో ఉపాధ్యాయుడి ఆత్మహత్య కుల బహిష్కరణ కేసులో సంచలన తీర్పు. ...ఐదుగురికి ఐదేళ్ల జైలు శిక్ష. ఎంపీడీవో కు, వినతి పత్రం అందజేత ఏఎంసీ చైర్మన్,వైస్ చైర్మన్ ను సన్మానించిన... -సర్పంచుల ఫోరం అధ్యక్షుడు శ్రీకాంత్ ఎంపీటీసీ జెడ్పీటీసీ పోలింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి. *ప్రొఫెసర్ కోదండరాం నివాసంలో విద్యుత్ జేఏసీ నాయకుడు ప్రశాంత్ జన్మదిన వేడుకలు* టిడిపి తోనే అభివృద్ధి సంక్షేమం.

పుర పోరులో ఉత్కంఠ రేపిన స్వతంత్ర అభ్యర్థులు

Select Suryaa Now
పుర పోరులో ఉత్కంఠ రేపిన స్వతంత్ర అభ్యర్థులు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం పురపోరులో ఉత్కంఠ క్షణాలు చోటుచేసుకున్నాయి. స్వతంత్రులు ఇచ్చిన పోటీ ప్రధాన పార్టీల అభ్యర్థులను పరుగులు పెట్టించాయి. జనసేన, టిడిపి అభ్యర్థులు చివరి క్షణం వరకు నరాలు తెగే ఉత్కంఠ కు గురి అయ్యారు అంటే వారు పోరాడిన తీరు ఇక్కడ ప్రస్థావించ వచ్చు. అమలాపురం 10 వార్డు లో జనసేన తరుపున గండి స్వామి బరిలో నిలబడ్డారు. సమస్యలు పై దూకుడుగా ఉండే స్వామి నెత్తిన చిరు వివాదం పడింది. దాంతో స్థానిక కుటుంబీకుల నుంచి స్వతంత్రుడు పుట్టుకొచ్చాడు. నిరంతరం ప్రజా సేవలో ఉండే హార్డ్ కోర్ టిడిపి నాయకుడు రాయపరెడ్డి సూరిబాబు బరిలోకి వచ్చారు. ఎన్నికల రంగంలో అతను జరిపిన పోరు గ్లాస్ గుర్తు ముందు బ్యాట్ గుర్తుతో బౌల్డ్ అయ్యాడు. 24 ఒట్లు తేడాతో ఓడిపోయారు

రెండవ వ్యక్తి పడాల నానాజీ

జనసేన కు హార్డ్ కోర్ నాయకుడు. గతంలో గెలిచిన ఆరుగురు జనసేన అభ్యర్థులు కు అవకాశం వస్తుందని భావించిన నానాజీ ఎదురు దెబ్బ తగిలింది.  టిడిపిలో గత కౌన్సిల్ వున్న ముగ్గురికి అవకాశం దక్కగా రిజర్వేషన్ అనుకూలంగా లేక పోవడం తో బొర్రా చిట్టిబాబు కు అవకాశం ఇవ్వలేదు. అయితే జనసేన లో  గత కౌన్సిలర్లు అందరికి పోటీ చేసే అవకాశం వున్నా ముగ్గురికి కల్పించి స్థానిక నేతలు ముగ్గుర్ని పక్కన పెట్టారు. నేతలు బుజ్జగింపులతో ఇద్దరు సర్దుకున్నా తనకు వచ్చిన అవకాశాన్ని దూరం చేసుకోను అంటూ పడాల నానాజీ జనసేన నేతలుపై వత్తిడి పెంచారు. పొత్తులో భాగంగా అతని వార్డు టిడిపి కి వెళ్లడం అక్కడ అనూహింగా నల్లా శ్రీదేవి బరిలోకి రావడం నానాజీ కి అహం దెబ్బతింది. తన భార్య పడాల శ్రీదేవి ని బరిలోకి దింపి పోరాటం చేశారు. కేవలం 40 ఒట్లు తో ఆయన విజయానికి దూరం అయ్యారు. స్వతంత్రులు వెనకాల ఏ పార్టీ నేతలు అంతర్గతంగా  ఉన్నా వీరు జరిపిన పోరు ప్రధాన పార్టీ అభ్యర్థులు కు చెమటలు పట్టించాయని చెప్పవచ్చు.