కార్తిక మాసంలో అరుణాచలానికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక యాత్రా సర్వీసు అవనిగడ్డ డిపో నుంచి ఈ నెల 14న సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు
అవనిగడ్డ, మేజర్ న్యూస్: కార్తిక మాసాన్ని పురస్కరించుకుని అవనిగడ్డ నియోజకవర్గం, పరిసర ప్రాంతాల భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక అరుణాచల యాత్రా సర్వీసును ఏర్పాటు చేసింది. అవనిగడ్డ డిపో నుంచి ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరనుంది.
ఈ యాత్రలో అరుణాచలం పుణ్యక్షేత్ర దర్శనంతో పాటు మరో తొమ్మిది ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను సందర్శించేలా ఏర్పాట్లు చేసినట్లు డిపో మేనేజర్ కె. హనుమంతరావు తెలిపారు. ఒక్కొక్కరికి రూ.3 వేలుగా చార్జీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
యాత్రకు సంబంధించిన టికెట్లను ఆర్టీసీ కౌంటర్లలో లేదా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు 99592 25466, 99636 58630, 73829 25700 నంబర్లను సంప్రదించాలని డిపో మేనేజర్ కోరారు.
✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.