BREAKING
అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి:పట్టభద్రులకు కాంగ్రెస్ నాయకుడు చిన్నయ్య పిలుపు తొట్టంబేడులో 77.94 శాతం పోలింగ్ అర్హులైన పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి:దోమ మండల మాజీ వైస్ ఎంపీపీ జి. మల్లేశం బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన యువకుడిపై పోలీసుల చర్యలు •ఆర్డీఓ ఎదుట హాజరు.. రూ.లక్ష జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి:లింగన్ పల్లి సర్పంచ్ ఎర్రోళ్ల గోపాల్ పీఏసీఎస్ ద్వారా రైతులకు రూ.2.69 కోట్ల రుణాలు పంపిణీ: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దర్శిలో ఐదు జడ్పీటీసీ స్థానాలు గెలుస్తాం గొట్టిపాటి లక్ష్మి మహిళల కొనుగోళ్లపై పరిశోధన.. సంతోష్ కుమార్‌కు డాక్టరేట్ జీవవైవిధ్య సదస్సులో సబ్సిడీ సంస్కరణలపై పురోగతి, ఫార్మా దిగ్గజాల అభ్యంతరాలు తల్లిదండ్రుల్లేని ఆడబిడ్డకు తల్లిలా అండ.. పెళ్లికి పుస్తె మెట్టెల బహూకరణ పెద్దపంజాణి మండలంలో ప్రశాంతంగా పోలింగ్- 79.39 శాతం ఓటింగ్ నమోదు పశ్చిమ హైదరాబాద్ ఆకాశహర్మ్యాల సాక్షిగా ఒత్తిడికి చిత్తవుతున్న నవతరం హృదయ వేదనకు అక్షర రూపమిది.. 1 తెలంగాణలో పచ్చిగుడ్ల మయోనైజ్‌పై ఏడాది పాటు పూర్తిస్థాయి నిషేధం బ్రెంబో వార్షిక అంచనాలను నిలబెట్టుకున్న ప్రముఖ ఆటో విడిభాగాల సంస్థ క్రిప్టో లాభాలపై 10 శాతం పన్ను...గ్రీస్ పార్లమెంట్ సంచలన చట్టం

మహిళల కొనుగోళ్లపై పరిశోధన.. సంతోష్ కుమార్‌కు డాక్టరేట్

Select Suryaa Now
మహిళల కొనుగోళ్లపై పరిశోధన.. సంతోష్ కుమార్‌కు డాక్టరేట్
ఘట్‌కేసర్, మేజర్ న్యూస్:మహిళల ఆన్‌లైన్ కొనుగోలు ప్రవర్తనపై సమగ్ర పరిశోధన చేసిన వెంకటాపూర్ అనురాగ్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి సంతోష్ కుమార్ కూర పీహెచ్‌డీ పట్టా పొందారు. అక్టోబర్ 9న నిర్వహించిన తుది వైవా వోస్‌లో తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారు. చిన్న వంటగది ఉపకరణాల కొనుగోలులో మహిళల ఆన్‌లైన్ ప్రవర్తనపై ప్రభావం చూపే అంశాలే ఇతివృత్తంగా ఆయన పరిశోధన సాగింది. ఉత్పత్తుల ధర, నాణ్యత, వినియోగ సౌలభ్యం, ఉపయోగకరత, ఆన్‌లైన్ సమీక్షలు మహిళల కొనుగోలు నిర్ణయాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయన్న అంశాలను విశ్లేషించారు.ఈ పరిశోధనకు అనురాగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. జి. మహేందర్ మార్గదర్శకత్వం వహించారు. కర్ణాటకలోని ఎన్‌ఐటీ సూరత్కల్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. బిజునా సి. మోహన్ బాహ్య పరీక్షకులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డీన్ డా. ఉట్ల బాలాజీ, విభాగాధిపతి డా. వి. విష్ణు వందన, పరిశోధన, అభివృద్ధి విభాగం డీన్ ప్రొఫెసర్ సతీష్ కుమారన్, పరీక్షల విభాగం డీన్ ప్రొఫెసర్ ముత్తా రెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి డా. సికిందర్ బాబా సంతోష్ కుమార్‌ను అభినందించారు. పరిశోధన మార్గదర్శకుడు డా. జి. మహేందర్‌ను సైతం ప్రశంసించారు.