BREAKING
అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి:పట్టభద్రులకు కాంగ్రెస్ నాయకుడు చిన్నయ్య పిలుపు తొట్టంబేడులో 77.94 శాతం పోలింగ్ అర్హులైన పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి:దోమ మండల మాజీ వైస్ ఎంపీపీ జి. మల్లేశం బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన యువకుడిపై పోలీసుల చర్యలు •ఆర్డీఓ ఎదుట హాజరు.. రూ.లక్ష జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి:లింగన్ పల్లి సర్పంచ్ ఎర్రోళ్ల గోపాల్ పీఏసీఎస్ ద్వారా రైతులకు రూ.2.69 కోట్ల రుణాలు పంపిణీ: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దర్శిలో ఐదు జడ్పీటీసీ స్థానాలు గెలుస్తాం గొట్టిపాటి లక్ష్మి మహిళల కొనుగోళ్లపై పరిశోధన.. సంతోష్ కుమార్‌కు డాక్టరేట్ జీవవైవిధ్య సదస్సులో సబ్సిడీ సంస్కరణలపై పురోగతి, ఫార్మా దిగ్గజాల అభ్యంతరాలు తల్లిదండ్రుల్లేని ఆడబిడ్డకు తల్లిలా అండ.. పెళ్లికి పుస్తె మెట్టెల బహూకరణ పెద్దపంజాణి మండలంలో ప్రశాంతంగా పోలింగ్- 79.39 శాతం ఓటింగ్ నమోదు పశ్చిమ హైదరాబాద్ ఆకాశహర్మ్యాల సాక్షిగా ఒత్తిడికి చిత్తవుతున్న నవతరం హృదయ వేదనకు అక్షర రూపమిది.. 1 తెలంగాణలో పచ్చిగుడ్ల మయోనైజ్‌పై ఏడాది పాటు పూర్తిస్థాయి నిషేధం బ్రెంబో వార్షిక అంచనాలను నిలబెట్టుకున్న ప్రముఖ ఆటో విడిభాగాల సంస్థ క్రిప్టో లాభాలపై 10 శాతం పన్ను...గ్రీస్ పార్లమెంట్ సంచలన చట్టం

పీఏసీఎస్ ద్వారా రైతులకు రూ.2.69 కోట్ల రుణాలు పంపిణీ: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

Select Suryaa Now
పీఏసీఎస్ ద్వారా రైతులకు రూ.2.69 కోట్ల రుణాలు పంపిణీ: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
పూడూరు, మేజర్ న్యూస్: రైతుల ఆర్థిక అభివృద్ధికి రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాలు ఎంతగానో ఉపయోగపడతాయని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి అన్నారు. రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను (పీఏసీఎస్) సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం అందించే రుణాలు, సబ్సిడీలు, ఇతర సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందాలని సూచించారు.గురువారం పూడూరు మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద 20 మంది రైతులకు రూ.2.69 కోట్ల విలువైన దీర్ఘకాలిక రుణాల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘంలో రూ.2,000 చెల్లించి సభ్యత్వం పొందిన వారికి ప్రభుత్వం మరో రూ.2,000 అందిస్తుందని తెలిపారు. ప్రస్తుతం పూడూరు రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘంలో 750 మంది సభ్యత్వానికి అవకాశం ఉండగా, 504 మంది సభ్యులుగా కొనసాగుతున్నారని వివరించారు.రైతులు దళారీ వ్యవస్థను, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, నేరుగా సహకార సంఘాల ద్వారా రుణాలు పొందాలని సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాల ద్వారా సబ్సిడీలు, వ్యవసాయ పరికరాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని తెలిపారు. రైతులు పండించిన పంటలకు ఇతర ప్రాంతాల్లో మార్కెటింగ్ సౌకర్యం కల్పించి, ఎగుమతులు చేసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ రఘునాథ్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ సురేందర్, సర్పంచ్ ఖిజర్ పాషా, కార్యదర్శి మురళి, వివిధ గ్రామాల సర్పంచులు, సొసైటీ డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.