BREAKING
అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి:పట్టభద్రులకు కాంగ్రెస్ నాయకుడు చిన్నయ్య పిలుపు తొట్టంబేడులో 77.94 శాతం పోలింగ్ అర్హులైన పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి:దోమ మండల మాజీ వైస్ ఎంపీపీ జి. మల్లేశం బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన యువకుడిపై పోలీసుల చర్యలు •ఆర్డీఓ ఎదుట హాజరు.. రూ.లక్ష జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష పడే అవకాశం ప్రభుత్వ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి:లింగన్ పల్లి సర్పంచ్ ఎర్రోళ్ల గోపాల్ పీఏసీఎస్ ద్వారా రైతులకు రూ.2.69 కోట్ల రుణాలు పంపిణీ: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దర్శిలో ఐదు జడ్పీటీసీ స్థానాలు గెలుస్తాం గొట్టిపాటి లక్ష్మి మహిళల కొనుగోళ్లపై పరిశోధన.. సంతోష్ కుమార్‌కు డాక్టరేట్ జీవవైవిధ్య సదస్సులో సబ్సిడీ సంస్కరణలపై పురోగతి, ఫార్మా దిగ్గజాల అభ్యంతరాలు తల్లిదండ్రుల్లేని ఆడబిడ్డకు తల్లిలా అండ.. పెళ్లికి పుస్తె మెట్టెల బహూకరణ పెద్దపంజాణి మండలంలో ప్రశాంతంగా పోలింగ్- 79.39 శాతం ఓటింగ్ నమోదు పశ్చిమ హైదరాబాద్ ఆకాశహర్మ్యాల సాక్షిగా ఒత్తిడికి చిత్తవుతున్న నవతరం హృదయ వేదనకు అక్షర రూపమిది.. 1 తెలంగాణలో పచ్చిగుడ్ల మయోనైజ్‌పై ఏడాది పాటు పూర్తిస్థాయి నిషేధం బ్రెంబో వార్షిక అంచనాలను నిలబెట్టుకున్న ప్రముఖ ఆటో విడిభాగాల సంస్థ క్రిప్టో లాభాలపై 10 శాతం పన్ను...గ్రీస్ పార్లమెంట్ సంచలన చట్టం

అర్హులైన పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి:దోమ మండల మాజీ వైస్ ఎంపీపీ జి. మల్లేశం

Select Suryaa Now
అర్హులైన పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి:దోమ మండల మాజీ వైస్ ఎంపీపీ జి. మల్లేశం
దోమ, మేజర్ న్యూస్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని దోమ మండల మాజీ వైస్ ఎంపీపీ జి.మల్లేశం కోరారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పట్టభద్రులకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన పట్టభద్రులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో పాటు మీడియా ప్రతినిధులు సైతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించి ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఓటు నమోదు విషయంలో నిర్లక్ష్యం చేయకుండా తమతో పాటు ఇతర అర్హులైన పట్టభద్రులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారం, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ ఎన్నికల్లో బి ఆర్ యస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలిపి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.