telangana
భూచన్ పల్లి శివారులో గంజాయి పట్టివేత.. ఇద్దరిపై కేసు నమోదు
మర్పల్లి, మేజర్ న్యూస్:మర్పల్లి మండలంలోని భూచనపల్లి గ్రామ శివారులో గంజాయి విక్రయాలు, వినియోగంపై పోలీసులు నిఘా పెట్టి 20 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భూచనపల్లి గ్రామ శివారులోని పొలాల వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ గంజాయి తీసుకువస్తున్నట్లు పోలీసులకు నమ్మదగిన సమాచారం అందింది. దీంతో ఎస్సై అబ్దుల్ రవూఫ్ తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని అనుమానితుడిని తనిఖీ చేయగా, అతని వద్ద ప్లాస్టిక్ కవర్‌లో 20 గ్రాముల గంజాయి లభించింది.విచారణలో గంజాయితో పట్టుబడిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన జైపాల్‌గా గుర్తించారు. అతను అదే గ్రామానికి చెందిన మల్‌రెడ్డి వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో గంజాయి కలిగి ఉన్న జైపాల్‌తో పాటు విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ తనిఖీల్లో ఎస్సై అబ్దుల్ రవూఫ్‌తో పాటు కానిస్టేబుళ్లు ఏలయ్య, నర్సింహ పాల్గొన్నారు. గ్రామాల్లో గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై నిఘా కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.