BREAKING
రైతు భరోసా నిధులు జమయ్యాయని ఫేక్ మెసేజ్‌లు విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీయడం అభినందనీయం:మార్కెట్ కమిటీ చైర్మన్ బి.ఎస్ ఆంజనేయులు ముదిరాజ్ కాలిఫోర్నియా నూతన బాలల సోషల్ మీడియా చట్టానికి వ్యతిరేకంగా గూగుల్, మెటా, టిక్‌టాక్ న్యాయపోరాటం అట్టహాసంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థ వేడుక: హాజరైన మెగా, అల్లు కుటుంబాల ప్రముఖులు సెన్సస్-2027 డ్యూటీ సర్టిఫికెట్ల మంజూరుకు టీఎస్‌యూటీఎఫ్ వినతి భవిష్యత్ నీటి కష్టాలను నివారించేందుకు ముందస్తు చర్యలు:సర్పంచ్ వార్వాల ఆంజీలయ్య సేవాలాల్ మందిరంలో మాజీ మంత్రి పూజలు విజయవంతంగా ముగిసిన భారత విదేశాంగ కార్యదర్శి నేపాల్ పర్యటన దర్శిలో వార్ వన్ సైడ్. పోలింగ్ సరళిని పరిశీలించిన అనురాధ నీటి పొదుపు, పశుగ్రాసం, ఉపాధి అంశాలపై గ్రామ సభలో సమీక్ష:సర్పంచ్ అంబికా లాలు నాయక్ నేపాల్ ప్రధానితో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి భేటీ భూ రీసర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం పెరవలి మండల వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ దిల్లీ ఆరోగ్య మందిర్లను తనిఖీ చేసిన ఆరోగ్య కార్యదర్శి

భూ రీసర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

Select Suryaa Now
భూ రీసర్వేతో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

డిజిటల్ విధానంలో భూ రికార్డుల రూపకల్పన.. రైతులందరూ సహకరించాలి : అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి

రంగారెడ్డి, మేజర్ న్యూస్ : భూరికార్డుల ఆధునికీకరణ, భూముల సరిహద్దుల గుర్తింపు, భూ వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన భూ రీసర్వే ప్రక్రియకు రైతులందరూ సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రారెడ్డి సూచించారు. భూ భారతి కార్యక్రమంలో భాగంగా గురువారం మంచాల్ మండలం మనోరాబాద్ గ్రామంలో ఆయన అధ్యక్షతన భూ రీసర్వేపై గ్రామసభ, అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఆధునిక DGPS సాంకేతిక పరిజ్ఞానంతో భూములను అత్యంత ఖచ్చితత్వంతో సర్వే చేసి డిజిటల్ భూ రికార్డులను రూపొందించనున్నట్లు తెలిపారు. రీసర్వే ద్వారా భూముల సరిహద్దులు స్పష్టంగా గుర్తించడంతో రైతుల మధ్య భూ వివాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు. భూముల విస్తీర్ణాన్ని కచ్చితంగా నిర్ధారించడంతో పాటు పాత భూ రికార్డులను డిజిటలైజ్ చేసి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు.

భూ యాజమాన్య హక్కులపై స్పష్టత రావడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు భూముల ఆక్రమణలను గుర్తించడం, భూముల సబ్‌డివిజన్ వివరాలను నమోదు చేయడం సాధ్యమవుతుందన్నారు. ఖచ్చితమైన భూ రికార్డుల వల్ల రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందడంతో పాటు బ్యాంకు రుణాలు తీసుకోవడం సులభతరమవుతుందని తెలిపారు. రీసర్వే పూర్తయిన తర్వాత నిబంధనల ప్రకారం కొత్త భూ రికార్డులు, పట్టా వివరాలను డిజిటల్ విధానంలో పొందుపరుస్తామని చెప్పారు.

288 ఎకరాల భూమికి రీసర్వే

మనోరాబాద్ గ్రామానికి సంబంధించిన భూ వివరాలను గ్రామసభలో అధికారులు వెల్లడించారు. గ్రామ మొత్తం భౌగోళిక విస్తీర్ణం 288 ఎకరాల 07 గుంటలు కాగా, మొత్తం 48 సర్వే నంబర్లు ఉన్నట్లు తెలిపారు. ఇందులో పట్టా భూమి 267 ఎకరాల 16 గుంటలు, ప్రభుత్వ భూమి 18 ఎకరాల 35 గుంటలుగా గుర్తించారు. ప్రభుత్వ భూముల్లో ఎండోమెంట్ భూమి 3 ఎకరాలు, ప్రభుత్వ భూమి 10 ఎకరాల 05 గుంటలు, లావణ్య పట్టా భూమి 5 ఎకరాల 30 గుంటలుగా వివరించారు. గ్రామంలో మొత్తం 388 సబ్‌డివిజన్ నంబర్లకు రీసర్వే చేయాల్సి ఉందని వెల్లడించారు.

రైతులు తమ భూములకు సంబంధించిన పాత రికార్డులు, పట్టాదారు పాస్‌బుక్‌లు, ఇతర సంబంధిత పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. సర్వే సమయంలో భూముల సరిహద్దులు, విస్తీర్ణం, ఇతర వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించుకోవాలని కోరారు. పారదర్శకమైన, ఖచ్చితమైన డిజిటల్ భూ రికార్డుల వ్యవస్థ ఏర్పాటుకు రీసర్వే ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో AD SLR ఎం. రామారెడ్డి, ఇబ్రహీంపట్నం RDO శ్రీనివాస్ రెడ్డి, మంచాల్ MRO వి. ప్రసాద్ రావు, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే డి. శ్రీనివాస్, మండల సర్వేయర్ ధనశ్రీ, లైసెన్స్ సర్వేయర్లు, గ్రామ పాలన అధికారి ఎన్. జంగయ్య, సర్పంచ్ ఎ. సంజీవరెడ్డి, మండల సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు.